ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీ దిగువ మరో బ్యారేజీకి కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి భవిష్యత్‌లో మంచినీటి కొరత ఉండరాదనే బృహత్తర సంకల్పంతో కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి 23 కిమీ ఎగువన రూ.2169 కోట్ల అంచనా వ్యయంతో కొత్త బ్యారేజీ నిర్మాణం కోసం జీవో జారీచేసిన ప్రభుత్వం తాజాగా ప్రకాశం బ్యారేజీకి 11 కిమీ దిగువ మరో బ్యారేజీని నిర్మించేందుకు కసరత్తు చేపట్టింది. ఇటీవల కాలంలో వరదలు లేక బ్యారేజీ దిగువ కృష్ణానదీ పరీవాహ ప్రదేశంలో చుక్కనీరు నిలువలేకపోవటంతో సముద్ర జలాలు చొచ్చుకు వచ్చి, భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారుతున్నాయి. ఇప్పటికే పామర్రు దాటి కంకిపాడు పరిసరాల్లోని భూగర్భ జలాలను సముద్రనీరు కలుషితం చేశాయి. దీంతో బ్యారేజీ దిగువ 11 కిమీ దూరంలోని పెనమలూరు మండలం చోడవరం వద్ద దాదాపు రూ.900 కోట్ల అంచనా వ్యయంతో మరో రోడ్డు కం బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనివల్ల గుంటూరు జిల్లా దుగ్గిరాల, కొల్లిపర వైపు రాకపోకలు మరింత సులభతరం కాగలవు. ఈ బ్యారేజీతో ప్రకాశం బ్యారేజీ నుంచి చోడవరం వరకు 2.3 టీఎంసీల నీటిని నిలువచేయవచ్చని భావిస్తున్నారు.