ఆంధ్రప్రదేశ్‌

రైల్వేజోన్ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 14: ఏపీకి సంబంధించి విశాఖలో రైల్వేజోన్ వస్తుందని, రావడం ఖాయమని విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ సమీపాన ఏర్పాటు చేసిన మెకనైజ్డ్ లాండ్రీ (బూట్ మోడల్)ను గురువారం ఎంపీ హరిబాబు, డివిజనల్ రైల్వే మేనేజర్ ముకుల్ శరన్ మాథూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు విలేఖరులతో మాట్లాడుతూ విశాఖలో రైల్వేజోన్ రావడం ఖాయమని, ఇది తన హయాంలోనే వస్తుందని, దీనికి సంబంధించి సూత్రప్రాయ రాజకీయ అంగీకారం కూడా కుదిరిందన్నారు. పార్లమెంటు సమావేశాల్లోపే దీనిపై ప్రకటన రానుందన్నారు. కేంద్ర రైల్వే శాఖామంత్రి పీయూష్ గోయెల్ దీనిపై సానుకూలంగా ఉన్నారన్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్, పెట్రోకెమికల్ కర్మాగారాలకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయన్నారు. వీటిపై కేంద్రం తగిన నిర్ణయం తీసుకోనుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి ఆగవన్నారు. విమాన సేవలకు సంబంధించి రాజకీయ కోణంతో చూడటం సరి కాదన్నారు. ఎమ్మెల్సీ మాధవ్, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.
కడప ఉక్క్ఫ్యుక్టరీకి కేంద్రం సానుకూలం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్టుగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉందని విశాఖ ఎంపీ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదన 2014లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని ఏం చర్యలు తీసుకుంటే, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందో తెలియచేయాల్సిందిగా ఆర్‌ఐఎన్‌ఎల్, మెకాన్ వంటి సంస్థలతో కలిపి టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయాన్ని హరిబాబు గుర్తు చేశారు. కేంద్ర ఉక్కు, మంత్రి బీరేంద్ర సింగ్ కూడా కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారని అన్నారు.