ఆంధ్రప్రదేశ్‌

కడప స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం మొండిచేయిపై నేతల మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొనబడిన కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం చర్యలు చేపట్టకపోగా సాధ్యం కాదంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించిందని, ఇక టీడీపీ ఎంపీలంతా ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమవుతున్నామని విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌కై తమ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న పోరాటంలో తాము కూడా భాగస్వాములు అవుతామన్నారు. ఈ విషయమై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేంద్రాన్ని ప్రశ్నించకుండా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదంటూ కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి రాష్ట్రానికి మరోమారు ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. ప్రత్యేక హోదాకు ఇప్పటికే మంగళం పాడారంటూ కడప ప్రజలు సాగించే ఉద్యమానికి సీపీఎం మద్దతుగా నిలుస్తుందన్నారు. రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయడం ఒక్కటే శరణ్యమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. జగన్ తన సొంత జిల్లాపైనే శ్రద్ధ చూపకపోవడం బాధాకరమన్నారు. నాలుగేళ్లపాటు చోద్యం చూసిన చంద్రబాబు ఇకనైనా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఐక్యంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. కేవలం ధర్మపోరాటం పేరిట ప్రజాధనాన్ని వృథా చేస్తూ దీక్షలు చేసినంత మాత్రాన కేంద్రం దిగి రాదని శివాజీ హెచ్చరించారు.
చంద్రబాబు ప్రభుత్వం
ఘోరంగా విఫలం: అంబటి రాంబాబు
కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రాన్ని నిలదీయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారంటూ వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పటిలా ఈ విషయంలో కూడా జగన్‌పై బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. విభజన చట్టంలో అపాయింటెడ్ డేట్ నుంచి ఆరు నెలల్లోపు సాధ్యాసాధ్యాల నివేదిక తెప్పించుకుని ఆ సంస్థలను నెలకొల్పేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పగా 2014 డిసెంబర్‌లోనే కేంద్రానికి సెయిల్ సంస్థ ఫీజిబులిటీ లేదని చెప్పగా అప్పటి నుంచి నాలుగేళ్లపాటు బీజేపీతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన బాబు చోద్యం చూస్తూ కూర్చున్నారాఅని ప్రశ్నించారు. దొంగలు పడ్డ ఆరు నెలలుకు మొరిగినట్లుగా ఈరోజు గగ్గోలు పెడుతున్నారని అన్నారు.