ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి పటిష్ఠ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 14: రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిరోధించేందుకు అటవీ శాఖ పటిష్ఠ వ్యూహాన్ని అనుసరించనుంది. పోలీసు శాఖ సమన్వయంతో స్మగ్లర్ల ఉనికిని కనిపెట్టి అదనపు సిబ్బందిని సమకూర్చుకోవడం ద్వారా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది. ఇప్పటికే తమిళనాడు అటవీ, పోలీసు శాఖల పరస్పర సహకారంతో స్మగ్లింగ్ నియంత్రణకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్మగ్లర్ల ఆటకట్టించేందుకు అత్యాధునిక ఆయుధాలను అటవీ శాఖ దిగుమతి చేసుకోనున్నట్లు రాష్ట్ర అటవీ దళాధిపతిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ ఇలియాస్ రిజ్వీ గురువారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. పోలీసు శాఖ నుంచి ఇప్పటికే 140 మందిని డిప్యూటేషన్‌పై బదిలీ చేశారని తెలిపారు. తిరుపతి, చిత్తూరు, కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, నెల్లూరు, గిద్దలూరు ప్రాంతాల్లో పోలీసు శాఖ నుండి డిప్యూటేషన్‌పై వచ్చిన సిబ్బందికి అటవీ శాఖ అధికారులు సహకరించాలని కోరారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణకు పటిష్ఠ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్లలో 2016-17కు గాను 911 కేసులు నమోదు చేశామని, 487.632 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని 705 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 3,344 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. 2017-18లో 90 కేసులు నమోదు కాగా 363.879 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకోవడంతో పాటు 685 వాహనాలను సీజ్ చేసి 2,776 మందిని అరెస్ట్ చేశామన్నారు.
ఈ ఏడాది జూన్ 8 వరకు 125 కేసులు నమోదు కాగా 58.742 టన్నుల ఎర్రచందనం సీజ్ చేయడంతో పాటు 88 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, 309 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. టాస్క్ఫోర్స్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహకారం తీసుకోవడంతో పాటు వెంటనే వారిని న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తున్నారని తెలిపారు. ఎర్రచందనం సంరక్షణకు ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను రూపొందించిందని, ఇందుకు 25కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు వారి వ్యూహాలను చిత్తుచేస్తూ అక్రమ రవాణా జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. శేషాచలం, లంకమల, పాలకొండల, వెలిగొండలు, నల్లమల అటవీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో స్మగ్లర్ల కదలికలను తెలుసుకునేందుకు తమిళనాడు అటవీ అధికారులు సహకారం అందిస్తున్నారని ఇలియాస్ రిజ్వీ వివరించారు.