ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు జనమే సిన్మా చూపిస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: అమరావతి, పోలవరం ప్రాజెక్టులను రెండు సిన్మాలుగా వ్యాఖ్యానించడం ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ సినిమా చూపించటం ఖాయమని ఎద్దేవా చేశారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడు ప్రధాన అంశాల పట్ల జగన్మోహన్‌రెడ్డికి ఉన్న అవగాహనా రాహిత్యానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనాలన్నారు. అమరావతి ఆయనకు భ్రమరావతిగా, పోలవరం సినిమాగా కనిపిస్తోందా.. 33వేల ఎకరాల భూమి రైతులు ఉదారంగా ఇవ్వడం మీకు సిన్మాగా కనిపిస్తోందా..? మన ల్యాండ్ పూలింగ్‌ను జాతీయ మీడియా ప్రశంసించడం, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కావడం సిన్మాగా ఉందాఅని ప్రశ్నించారు. అమరావతి తమకు ‘్ఫ్లగ్ షిప్’ ప్రోగ్రాం అని సింగపూర్ ప్రధాని ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పేర్కొనడం కూడా సిన్మాగా కనిపిస్తోందా అన్నారు. విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలలో వేలాదిమంది విద్యార్థులు చదువుకోవడం, 118 రోజుల్లో ఇంటెరిమ్ కాంప్లెక్స్ నిర్మించడం సిన్మాగా ఉందా? రూ.20వేల కోట్లతో రోడ్లు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం సిన్మాగా ఉందా అన్నారు. పోలవరం ప్రాజెక్టును సిన్మా అనడం ద్వారా దానివల్ల లబ్ధిపొందే లక్షలాది మంది రైతులను, ఇతర వర్గాల ప్రజలను జగన్మోహన్‌రెడ్డి అవమానించినందున తక్షణం క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.