ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కావాలని ఆ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నేతలతో గురువారం రాత్రి సమీక్షా స సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు చేయడం ఎంత ముఖ్యమో, ప్రజలతో మమేకం కావడం కూడా అంతే ముఖ్యమన్నారు. మైనారిటీల్లో టీడీపీ పట్ల పెరిగిన ఆదరణ శుభ సూచకమని, దీనిని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. కార్యకర్తలను నాయకులు ఆదరించాలని, రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపు ఏక్షపక్షం కావాలన్నారు. రాబోయే 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ గెలుపొందాలన్నారు. విభజన చట్టంలో అంశాలను, ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చగలమన్నారు. 1983, 1994లో చిత్తూరులో ఒక్కటి తప్ప అన్ని స్థానాలను గెలుచుకున్నామన్నారు. ఎంపీ స్థానాన్ని ఆరుసార్లు గెలిచామని, ఈసారి అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ గెలవాలన్నారు. నూటికి 90 శాతం కార్యకర్తలు మన నుంచి కోరేది గౌరవం మాత్రమేనని, పనులు అడిగే వాళ్లు కేవలం 10 శాతం మంది ఉంటారన్నారు. కార్యకర్తలకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో లోపం జరిగితే ఊరుకునేది లేదన్నారు. కార్యకర్తల కోసం పూర్తి సమయం కేటాయించాలన్నారు. ఈ నాలుగేళ్లలో చిత్తూరు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. 5 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే స్వీప్ చేసే వాళ్లమన్నారు. అది తెలిసే, ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారన్నారు. రాజీనామాల గురించి 2016, 2017లో చెప్పారని, 2018లో బడ్జెట్ సమావేశాల్లో ఆఖరి రోజున ఎన్నికలు రావని తెలిసి రాజీనామా చేశారన్నారు.బీజేపీ అడుగులో వైకాపా అడుగేస్తోందన్నారు. కుట్ర రాజకీయాలను ఎండగట్టాలన్నారు. రాజీనామాలు చేసినట్లు ఉండాలని, కానీ ఉప ఎన్నికలు రాకుండా చూడాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. కుట్రదారులకు, పాత్రధారులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో పార్టీ నేతలు కళా వెంకటరావు, మంత్రులు అచ్చెన్నాయుడు, అమరనాథ్ రెడ్డి, ఎంపీ శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.