ఆంధ్రప్రదేశ్‌

చెత్త కనిపించిందా..అప్పుడు చెబుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: ప్రజలకు ముందు పరిశుభ్రత అలవాటుగా మారాలని, తద్వారా ఒక సంస్కృతి అలవాటవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ స్వరాజ్య మైదానం వద్ద చెత్త డంపింగ్‌పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ రహదారులపై వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీ స్టేట్ సెంటర్ నుంచి తొలిసారిగా రహదారులను వర్చ్యువల్ ఇన్స్‌పెక్షన్ ద్వారా గురువారం సీఎం తనిఖీ చేశారు. అప్పటికీ ప్రజలు మారకపోతే తగిన విధంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా కొల్లిపర రహదారి పనులను సీఎం పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రదేశంలో అధికారులు ఎవరూ లేకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. చినపాలెం-వల్లభాపురం రహదారిలో పైపులైను వేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇది అధికారుల, కాంట్రాక్టరు బాధ్యతా రాహిత్యంగా తెలిపారు. ఈ పనులు చేసే కాంట్రాక్టరు, అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. 2016లో మంజూరైన పనులు ఇప్పటికీ పూర్తి చేయకపోవడం క్షమార్హం కాదని, అధికారుల వివరణ క్షమార్హం కాదన్నారు. సంబంధిత జేఈని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ స్వరాజ్యమైదానం వద్ద చెత్త డంపింగ్ చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ క్లీన్‌సిటీ అని తెలిసీ, కిందిస్థాయి సిబ్బంది పనితీరును, పారిశుద్ధ్య పరిస్థితులను ఎందుకు నిరంతరం పర్యవేక్షించడం లేదు? అంటూ మున్సిపల్ అధికారులను మందలించారు. విజయవాడ నగరంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడానికి వీల్లేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడి సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఏఎంహెచ్‌ఓను సస్పెండ్ చేశారు. ఎక్కడా మురుగునీటి పారుదల వ్యవస్థలో ఇబ్బంది ఉండకూడదని, కమిషనర్లు అందరినీ అప్రమత్తం చేయాలన్నారు. గ్రామాల్లో కూడా ఎక్కడ చెత్త కనిపించినా, సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

చిత్రం..ఆర్టీజీఎస్ సెంటర్ నుండి వర్చువల్ తనిఖీ చేస్తున్న ముఖ్యమంత్రి