ఆంధ్రప్రదేశ్‌

తిరుమల ఘాట్‌లో టెంపో బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 14: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన కర్ణాటక రాష్ట్రం మైసూరు సమీపంలోని హర్థన్ హళ్లి గ్రామానికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న టెంపోట్రావెలర్ మొదటి కనుమ మార్గంలో 1వ మలుపు వద్ద బోల్తా పడిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని భక్తులు అంటున్నారు. బోల్తాపడిన వాహనం మలుపువద్ద ఉన్న గ్రిల్‌ను ఢీకొని ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే సమీపంలో ఉన్న లోయలో పడి ఉండేదని భక్తులు తెలిపారు. టెంపో ట్రావెలర్‌లో సుమారు 13 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో ఐదుగురు పిల్లలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తక్కిన 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన జరిగిన వెంటనే కనుమమార్గంలో వాహనాల్లో వెళుతున్న భక్తులు వెంటనే స్పందించి భక్తులను వాహనం నుంచి వెలికి తీశారు. ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు స్పృహతప్పి పడిపోవడంతో వారికేమైందోనని వారి కుటుంబ సభ్యులు చేసిన ఆర్తనాదాలతో శేషాచల కొండలు దద్దరిల్లాయి. మలుపువద్ద వాహనం బోల్తాపడటంతో కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలు విన్న ఇతర వాహనాలు, బస్సుల్లో ఉన్న ప్రయాణికులు పై మలుపువద్ద నుంచి వారిని చూస్తూ సానుభూతి వ్యక్తం చేయడం కనిపించింది. సమాచారం తెలుసుకున్న టీటీడీ భద్రతా సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి, స్విమ్స్‌కు తరలించారు. తీవ్రగాయాలైన ఐదుగురు స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్విమ్స్, రుయా ఆసుపత్రుల వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..తిరుమల ఘాట్‌లో బోల్తాపడ్డ టెంపో