ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా మంత్రి నారాయణ జన్మదిన వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పలువురు మంత్రుల సమక్షంలో మున్సిపల్ మంత్రి నారాయణ 60వ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. నారాయణకు ముఖ్యమంత్రి పుష్పగుచ్ఛం అందించి ఉత్సాహంగా కేక్ తినిపించారు. శుక్రవారం ఉదయం అమరావతి రాజధాని ప్రాంతమైన నవులూరులో రాజధాని పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాన్ని, నేలపాడులో ఎన్‌జీవోల కోసం నిర్మిస్తున్న ఇళ్ల సముదాయాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా నవులూరు, నేలపాడులో మంత్రి నారాయణ ఇళ్ల లబ్ధిదారులు, రైతుల సమక్షంలో తన జన్మదినోత్సవం సందర్భంగా నిరాడంబరంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా రాజధానిలో ప్రజల సమక్షంలో జన్మదినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అభిమానులు నా మీద ఉన్న వాత్సల్యంతో ఈ కేక్‌ను ఏర్పాటుచేసి కట్ చేయించడం మరువలేనిదన్నారు. అనుకున్న సమయానికే లబ్ధిదారుల గృహ సముదాయాలను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి వారికి తెలిపారు.