ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడులు ఇవిగో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: ఏపీలో ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయంటూ వైసీపీ ఎంపీలు, నేతల ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఘాటైన సమాధానమిచ్చారు. ఇప్పటికే ఏపీకి 531 పరిశ్రమలు, లక్షా 29వేల 661 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 2.64 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర పరిశ్రమల శాఖ గతంలో సమాధానమిచ్చిందని అన్నారు. అందుకే ఆ పార్టీవారిని అసెంబ్లీ నుండి పారిపోవద్దని సీఎం పదే పదే రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎవరైనా ముందుకు వస్తే పరిశ్రమలు ఎక్కడ వచ్చాయో, ఉద్యోగాలు ఎక్కడ కల్పించామో చూపిస్తామన్నారు. పరిశ్రమల మంత్రి స్వయంగా వారిని తన వెంట తీసుకొని వెళ్తారంటూ.. మీరు సిద్ధమా అని లోకేష్ సవాల్ విసిరారు.