ఆంధ్రప్రదేశ్‌

వేదిక్ వర్శిటీ ఆధ్వర్యంలోనే వేద పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 15: వేద పరిరక్షణకు సంబంధించి టీటీడీ మరింత ప్రత్యేక దృష్టిసారిస్తోందని ఈక్రమంలో 86 వేద పాఠశాలల నిర్వహణను వేదిక్ వర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ తిరుపతి జేఈఓ, వేదిక్ వర్శిటీ వీసీ పోలభాస్కర స్పష్టం చేశారు. శుక్రవారం తిరుమలలోని వేదిక్ వర్శిటీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ ఆర్థిక సాయంతో 86 వేదపాఠశాలలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇకపై ఈ వేదపాఠశాలల నిర్వహణ వేదిక్ వర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. వీటికి అవసరమైన ఆర్థిక సాయం వర్శిటీ నుంచే అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. కొత్తకోర్సులు, సంప్రదాయ కోర్సుల నిర్వహణతో వేద విశ్వవిద్యాలయం ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కొన్ని అమూల్య పుస్తకాలను, తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. కాగా ఈనెల 18వత తేదీ నుంచి విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, తిరుపతి, బెంగళూరు, పూరీ నగరములలో వేద సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కాగా వర్శిటీ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జే ఈ ఓ పోలాభాస్కర్ చెప్పారు.