ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో జలాశయాలు వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: సాధారణంగా జూన్ రెండోవారం నుంచే సాగునీటి జలాశయాల పరిధిల్లో నారుమళ్లు పోసుకోటానికి రైతులు సమాయత్తమవుతుంటారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కృష్ణా, తూర్పుగోదావరి మినహా మిగిలిన జిల్లాల్లో సగటు వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావటం, ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహాలు లేక జలాశయాలు వెలవెలపోతూ కన్పిస్తున్నాయి. కృష్ణా బేసిన్ విషయానికి వస్తే ఎగువ ప్రాంతంలో జలాశయాలు పూర్తిగా నిండితేగాని దిగువకు చుక్కనీరు రాని స్థితి నెలకొంది. వాస్తవానికి గత ఏడాది సాగర్ జలాశయం నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చిన నీరు నామమాత్రమే. అయితే పట్టిసీమ ద్వారా వచ్చిన నీటితోనే 13లక్షల ఎకరాల కృష్ణాడెల్టా ఆయకట్టులో ఖరీఫ్ సాగు జరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి నిలువ సామర్థ్యం 3.07 టీఎంసీలు రాగా ప్రస్తుతం 2.86 టీఎంసీలకు మించిలేని స్థితి నెలకొంది. ఎగువ నుంచి చుక్కనీరు వచ్చి చేరటం లేదు. గోదావరికి నీటి ప్రవాహ తాకిడి చేరితే గాని పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజికి చేరే పరిస్థితి కన్పించటం లేదు.