ఆంధ్రప్రదేశ్‌

పచ్చదనం పెంపునకు చర్యలు: మంత్రి శిద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: అటవీ ప్రాంత అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన అటవీ శాఖ, రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడానికి పలు కార్యక్రమాలు రూపొందించినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. హరితశ్రేణి కార్యక్రమం కింద విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, అనంతపురం సర్కిళ్లలో రూ.17.52 కోట్ల రూపాయల వ్యయంతో 876 కి.మీ మేర జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన రహదారులకిరువైపులా మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. మన్యహరితం కార్యక్రమం కింద బోడికొండల మీద పచ్చదనాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 7 సర్కిళ్లలో 214 బోడికొండలను గుర్తించామని, 6542 హెక్టార్లలో స్థానిక వాతావరణ పరిస్థితుల్లో పెరిగే మొక్కలు పుష్పజాతులను ఈ కొండల మీద నాటనున్నట్లు తెలిపారు. హరితతీరం కార్యక్రమం కింద సముద్రతీరానికి రక్షణగా 920 హెక్టార్లలో సరుగుడు, తాటి చెట్లను పెంచడంతో పాటుగా 380 హెక్టార్లలో మడ అడవులను పెంచనున్నట్లు వెల్లడించారు.