ఆంధ్రప్రదేశ్‌

త్వరలో రేషన్ డిపోల్లో పామాయిల్, ఉప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: రేషన్ డిపోల ద్వారా త్వరలో పామాయిల్, ఉప్పు వంటి నిత్యావసర వస్తువులు అదనంగా ఇవ్వనున్నామని, వచ్చే నెల నుంచి కార్డుకు 2కేజీల కందిపప్పు అందజేయనున్నామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తృణ ధాన్యాలు కూడా ఇచ్చే ఆలోచన ఉందన్నారు. మీ సేవతో సంబంధం లేకుండా ప్రజాసాధికార సర్వేలో పేర్లు నమోదు చేసుకున్న వారికి స్ప్లిట్ రేషన్ కార్డులు అందజేయనున్నామన్నారు. మరో రెండు నెలల్లో 95శాతం సంతృప్తిస్థాయి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనిచేయని రేషన్ డీలర్లను తొలగిస్తామని హెచ్చరించారు. సరుకుల పంపిణీ కోసం డీలర్ కుటుంబ సభ్యుల్లో ఒకరిని నామినీగా నియమించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13 జిల్లాలకు చెందిన డీలర్లు, డీలర్ సంఘాల ప్రతినిధులతో రేషన్ షాపుల పనితీరు మెరుగుపర్చడానికి తీసుకునే చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు.