ఆంధ్రప్రదేశ్‌

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని దగ్ధమైన స్కూలు బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, జూన్ 15: తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం తప్పింది. 15మంది పిల్లలతో వెళుతున్న ప్రైవేటు స్కూలు బస్సు అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొంది. అయితే బస్సులోనే ఉన్న ఒక ఉపాధ్యాయిని అప్రమత్తంగా వ్యవహరించి, పిల్లలను బస్సు నుండి దించేయడంతో వారంతా ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. వివరాలిలావున్నాయి... తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం అన్నాయిపేట గ్రామంలోని శ్రీలక్ష్మీ శార్వాణీ ఉన్నత పాఠశాల బస్సు నిత్యం వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులను పాఠశాలకు తరలిస్తుంది. శుక్రవారం ఉదయం కొన్ని గ్రామాలకు చెందిన 15మంది చిన్నారులను తీసుకుని బయల్దేరిన బస్సు భీమక్రోసుపాలెం రామాలయం సమీపంలో రహదారి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొంది. దీనితో స్వల్పంగా మంటలు చెలరేగాయి. దీనితో బస్సులోనే ఉన్న ఉపాధ్యాయిని రాజేశ్వరి స్పందించి, పిల్లలందరినీ బస్సు దించేశారు. ఈలోగా డ్రైవరు బస్సును రివర్స్‌చేసి, ముందుకు నడిపించే ప్రయత్నం చేయడంతో మరోసారి ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొంది. దీనితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. బస్సు మంటల్లో దగ్ధమవుతుండటాన్ని చూసిన చిన్నారులు హాహాకారాలు చేశారు. వెంటనే ఉపాధ్యాయిని పిల్లలను సమీపంలోని ఒక ఇంట్లోకి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆదుర్దాగా సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే పిల్లలంతా సురక్షితంగా ఉండటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. రోజూ వచ్చే డ్రైవరు స్థానంలో తాత్కాలిక డ్రైవరు బస్సును నడపటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.