ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 15: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న వివిధ పథకాల్లో చోటుచేసుకుంటున్న అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎన్నికల పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండుచేశారు. దీనిపై త్వరలో ఢిల్లీ వెళ్లనున్నట్టు ఆయన ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో రూ.30 వేల కోట్లు, నీరు చెట్టు పథకంలో రూ.13వేల కోట్లు పక్కదారి పట్టాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతీ కేంద్ర పథకాన్ని ఆదాయ వనరుగా మలుచుకుని, భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉండగా ఏపీకి హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో ఏడు లక్షల ఇళ్లు మంజూరుచేశారని, అందులో ఆరు లక్షల ఇళ్లు ప్లాట్లుగా నిర్మిస్తుంటే, మరో లక్ష ఇళ్లు వ్యక్తిగతంగా స్థలాలున్నవారికి మంజూరుచేస్తున్నారని వివరించారు. 300 చదరపు మీటర్లు, 420 చదరపు మీటర్ల ఫ్లింత్ ఏరియాల్లో రెండు విభాగాలుగా నిర్మించే ఈ ఇళ్లకు గజానికి రూ.1000 ఖర్చవుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.2400 చొప్పున కాంట్రాక్టు ఇచ్చిందన్నారు. ఇందులో 300 చదరపు అడుగుల ఇంటికి రూ.3,60,000 వంతున, 420 చదరపు అడుగుల ఇంటికి రూ.ఐదు లక్షల వంతున దుర్వినియోగం అవుతోందన్నారు. మొత్తం మీద ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని సోము ఆరోపించారు. విపక్ష నేత జగన్ రూ.40వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న చంద్రబాబునాయుడు, ఒక్క గృహ నిర్మాణంలోనే ఇంత అవినీతికి పాల్పడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు పేదవాడి రక్తాన్ని తాగేస్తున్న పులి అని సోము అభివర్ణించారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లలో ఇంత పెద్ద అవినీతి జరిగితే మరో 10 వేల ఇళ్లు మంజూరుచేయాలని కేంద్రం వద్ద అర్జీ పెట్టుకున్నారని, అయితే అవి మంజూరయ్యే అవకాశం లేదన్నారు. ఇక నీరు చెట్టు పథకం విషయానికొస్తే ఇది టీడీపీ కార్యకర్తలకు ఉపాధి పథకంగా మారిందని సోము ఆరోపించారు. కార్యకర్తలు చేసే అవినీతి, అక్రమాల పట్ల చూసీ చూడనట్టుగా సీఎం వ్యవహరించమన్నారని సాక్షాత్తూ రాష్టస్థ్రాయిలో ఒక ఉన్నత స్థాయి అధికారి తనతో అన్నారని, అంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబునాయుడు తానుకడిగిన ముత్యంలా మాట్లాడుతున్నారని సోము ఎద్దేవాచేశారు. ఈ పథకంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విభాగానికి, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశానన్నారు. ఈ రెండు పథకాల్లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు పట్టుబట్టడానికి త్వరలో తాను ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఒక సంపూర్ణ విప్లవోద్యమం రావలసిన అవసరం ఉందన్నారు. మోదీ లేనిదే రాష్ట్రంలో చంద్రబాబు లేడని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తే ఆ సంస్థ కార్యాలయాలను రాష్ట్రంలోనే శాశ్వతంగా పెట్టాల్సి వస్తుందని ఈసందర్భంగా సోము చమత్కరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ సంకీర్ణ ప్రభుత్వమని ఎద్దేవాచేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో విమర్శించే నైతికత టీడీపీకి లేదన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారని సోము తెలిపారు.