ఆంధ్రప్రదేశ్‌

హోంగార్డులకు సీఎం వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న హోంగార్డులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాలు ప్రకటించారు. హోంగార్డుల దినసరి వేతనాన్ని 300 రూపాయల నుంచి 600 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో హోంగార్డుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో శుక్రవారం సీఎం సమావేశమయ్యారు. ఆ సంఘం అధ్యక్షుడు గోవింద్ సహా 100 మందితో వారి సమస్యలపై సీఎం చర్చించారు. అనంతరం దినసరి వేతనం పెంచేందుకు అంగీకరించారు. మెటర్నటీ సెలవులను మూడు నెలలకు పెంపు, దహన సంస్కారాల కోసం 10 వేల రూపాయలు, ఎన్టీఆర్ వైద్య సేవలో 2.5 లక్షల రూపాయల మేర వైద్య సహాయం, గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధి చేకూర్చే అంశాన్ని అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, నెలలో రెండు రోజులు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. హోంగార్డుల దినసరి వేతనం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉందన్నారు. అయితే హోంగార్డుల సాదక బాధకాలు విన్న తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా హోంగార్డుల దినసరి వేతనం పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 60 సంవత్సరాలు కలిసి ఆస్తులు సృష్టించామని, అన్నీ వదిలి విభజన తరువాత రావాల్సి వచ్చిందన్నారు. నాలుగేళ్లు కష్టపడి ఓ కొలిక్కి తీసుకొచ్చామని మరో పది సంవత్సరాలు కష్టపడితేగాని మిగిలిన రాష్ట్రాల కన్నా ముందుకు వెళ్లలేమన్నారు. తెలంగాణాకు 42శాతం జనాభా ఉంటే 58 శాతం ఆస్తులు దక్కాయని, మనకు 58 శాతం జనాభా ఉంటే 42 శాతం ఆస్తులు మాత్రమే దక్కాయని అన్నారు. విభజన కష్టాలు ఉన్నప్పటికీ హోంగార్డుల కష్టాలు చూసి ఆదుకోవాలని నిర్ణయించానన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ముఖ్యమని, విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. హోంగార్డుల వేతనాలు క్రమంగా పెంచుకుంటూ వెళతామని తెలిపారు. మీ సహకారం కూడా ప్రభుత్వానికి ఉండాలని రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల్లో సంతృప్తిని పెంచాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీజీపీ మాలకొండయ్య, హోంశాఖ కార్యదర్శి అనూరాధ, డీజీ (నిఘా) వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హోంగార్డుల సంక్షేమ సంఘం ప్రతినిధులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు