ఆంధ్రప్రదేశ్‌

త్వరలో రేషన్ దుకాణాల్లో సోషల్ ఆడిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: రేషన్ దుకాణాల నిర్వహణ తీరు, డీలర్ల వ్యవహారశైలిపై కార్డుదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరించే నిమిత్తం ప్రభుత్వం నియమించనున్న సోషల్ ఆడిట్ బృందాలు పర్యటించబోతున్నాయని రాష్ట్ర డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవరావు తెలిపారు. శనివారం ఇక్కడ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో డీలర్ల పనితీరుపై కార్డుదారుల సంతృప్తిస్థాయి 60 నుంచి 75 శాతం వరకు ఉన్నదని సీఎం చంద్రబాబు తన సర్వేల ద్వారా స్పష్టం చేస్తున్నందున డీలర్లు తమ పనితీరును మరింతగా మెరుగుపరచుకుని మరో నెల రోజుల్లో సంతృప్తిస్థాయిని 90 శాతంకు పెంచేలా కృషి చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల కంటే ముందుగా ఇక్కడే కమీషన్‌ను ఒకేసారి రూ.20ల నుంచి రూ.70లకు పెంచారన్నారు. సంక్రాంతి, రంజాన్ తోఫాలకు కమీషన్‌ను రూ.10లకు పెంచడంతోపాటు డీలర్ల ఆదాయం పెంపుదల కోసం చంద్రన్న విలేజ్‌మాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. కేంద్రం పంచదార, కిరోసిన్‌ను ఎత్తివేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు పైగా సబ్సిడీని భరిస్తూ కార్డుదారులకు అందిస్తున్నందున ప్రజాపంపిణీ వ్యవస్థ మరింత బలోపేతానికి కార్డుదారులతో డీలర్లు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్కరికీ రసీదు ఇవ్వాలని, చనిపోయిన అలాగే పెళ్లయి వెళ్లిపోయిన వారి వివరాలను వెంటనే అధికారులకు తెలపాలని, వారి రేషన్‌ను నొక్కేయడానికి ఏ ఒక్కరూ అక్రమాలకు పాల్పడవద్దని లీలామాధవరావు కోరారు. తూకంలో మోసాలకు తావు లేకుండా డీలర్లు ముందుగా గోదాములకు స్వయంగా వెళ్లి కరెక్ట్ తూకంతో తమ సరుకులు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అరువుగా ఇస్తున్న కందిపప్పును పెద్ద మనస్సుతో తీసుకుని కార్డుదారునికి కిలో రూ.40లకు అందజేయాలని, అంత్యోదయ కార్డుదారులకు కిలో పంచదార రూ.13.50పైసలకు, ఇతర కార్డుదారులకు అరకిలో రూ.10లకు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం తాజాగా పంచదారపై క్వింటాల్‌కు కమీషన్‌ను రూ.15ల నుంచి రూ.70లకు, కందిపప్పుపై రూ.55ల నుంచి రూ.70లకు పెంచినందుకు సీఎం చంద్రబాబు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులకు లీలామాధవరావు కృతజ్ఞతలు తెలిపారు. ఇక డీలర్లు సత్వరం సీఎం ఆశిస్తున్న రీతిలో తమ పనితీరును మెరుగుపరచుకోని పక్షంలో ఏకంగా డీలర్‌షిప్‌ను కోల్పోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.

అడుగు ముందుకు పడని విలేజ్ మాల్స్

విశాఖపట్నం, జూన్ 16: రాష్ట్రంలో రేషన్ దుకాణాలను చంద్రన్న విలేజ్ మాల్స్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం ముందుకు సాగే సానుకూల పరిస్థితులు కన్పించట్లేదు. విలేజ్‌మాల్స్ ఏర్పాటులో రిలయన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఎంఓయూపై అడుగు ముందుకు సాగట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల పైచిలుకు రేషన్ షాపులుండగా, ఎంపికి చేసిన షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది కిందట ఈ మేరకు నిర్ణయం తీసుకుని ప్రయోగాత్మకంగా 100 రేషన్ షాపులను మాల్స్‌గా మార్చారు. వీటి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మాల్స్ ఏర్పాటుకు సంబంధించి రియలన్స్ గ్రూపుతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. మాల్స్‌లో విక్రయించే వస్తువులు రిలయన్స్ సంస్థ సరఫరా చేస్తుంది. రేషన్ దుకాణాలను మాల్స్‌గా మార్చేందుకు అవసరమయ్యే ఖర్చును 50 శాతం రిలయన్స్ సంస్థ, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 25 శాతం ముద్ర రుణం రూపంలో డీలర్ భరించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇది కార్యరూపం దాల్చలేదు. దీంతో 50 శాతం రిలయన్స్ సంస్థ, మిగిలిన 50 శాతం డీలర్ భరించేలా నిర్ణయించారు. దీనిపై కూడా అడుగు ముందుకు పడలేదు. తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. మాల్స్ ఏర్పాటుకయ్యే ఖర్చు పూర్తిగా డీలర్ భరించాలని, ఈ మొత్తాన్ని రిలయన్స్ సంస్థ 8 శాతం వడ్డీతో రుణంగా సమకూర్చేలా ప్రతిపాదించారు. దీనికి డీలర్లు అంగీకరించట్లేదు. తొలి దశలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మాల్స్‌లో ప్రారంభంలో సరుకులపై 8 శాతాన్ని కమీషన్‌గా ఇచ్చేవారు. తాజాగా దీన్ని 4 శాతానికి తగ్గించారు. దీంతో కొత్తగా మాల్స్ పెట్టేమాట అటుంచితే పాతవాటిని కొనసాగించేందుకు డీలర్లు ఆసక్తి చూపట్లేదు. మాల్స్‌లో నెలకు కనీసం రూ.3 లక్షలు వ్యాపారం సాగితే వచ్చేది కేవలం రూ.12వేలు. ఈ మొత్తంలోనే అద్దె, కరెంటు, సహాయకుని జీతం చెల్లించడంతో పాటు డీలర్‌కు ఏం మిగులుతుందని ప్రశ్నిస్తున్నారు.