ఆంధ్రప్రదేశ్‌

వాస్తవాలు చెప్పండి అన్నీ ఇచ్చామంటున్న కేంద్రం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: రాష్ట్ర విభజన చట్టంలోని 85 శాతం హామీలను నెరవేర్చామని ఒకపక్క కేంద్రం చెబుతుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం విభజన హామీలను నెరవేర్చాలంటూ పదే పదే విజ్ఞాపన పత్రాలు పంపుతున్నారు.. ఈ రెండింటిలో ఏది నిజమని తెలుగుజాతి శ్రేయస్సుకై రాజకీయాల కతీతంగా పోరాడుతున్న విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, కార్యదర్శి కేతిరి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్య సలహాదారు, సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వాసిరెడ్డి కృష్ణారావు ప్రశ్నించారు. ఈ మేర విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ‘ఈ రెండింటిలో ఏది నిజం’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల నాయకులు రాష్ట్ర శ్రేయస్సు కోసం రాజకీయాల కతీతంగా పోరాడాల్సి ఉంటే బీజేపీ నేతలు కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఢిల్లీలో విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, రామాయపట్నం పోర్టు, చమురు రిఫైనరీ, విశాఖ, విజయవాడలలో మెట్రో, జాతీయ విద్యాసంస్థలకు నిధులు, వెనుకబడ్డ ఏడు జిల్లాలకు రూ.150 కోట్లు కావాలని కోరుతూ ప్రధానికి వినతి పత్రం ఇచ్చారన్నారు. కానీ పదేళ్లపాటు ప్రత్యేక హోదా, లోటుబడ్జెట్ నిధులు, ఢిల్లీని తలదనే్న మోదీ కలల రాజధాని అమరావతికి అవసరమైన నిధులు, బుందేల్‌ఖండ్ తరహాలో వెనుకబడ్డ జిల్లాలకు రూ.30వేల కోట్లు సహాయం, పోలవరం బాధితుల పునరావాసానికి నిధుల గురించి తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ హేతుబద్ధత లేని మోసపూరిత విభజన చేయగా నేడు బీజేపీ నమ్మించి మోసగించిందన్నారు. కేవలం అమరావతి నగరంలో వౌలిక సదుపాయాల కల్పనకు కనీసం రూ.40వేల కోట్లు అవసరం కాగా కేంద్రం ఇచ్చిన రూ.2,500కోట్లలో మోదీ కలల రాజధాని నిర్మాణం ఎప్పటికి, ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. తాజాగా రాష్ట్రాల హక్కులను హరించే కుట్రను కేంద్రం సాగిస్తున్నందున తెలుగువారంతా ఏకమై దీటుగా ఎదుర్కోవాలన్నారు. ఈ సమావేశంలో మహాసభ నాయకులు కె.జగదీష్, దామోదర్, రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.