ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ, వైసీపీ దొంగాట ముసుగు తీసి పొత్తు పెట్టుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), జూన్ 16: టీడీపీకి పెరుగుతున్న ఆదరణ, సానుభూతిని చూసి ఓర్వలేని బీజీపీ మా ప్రత్యర్థులను ఏకం చేసి దాడి చేయించేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. దీనిలో భాగంగానే బీజేపీ నేతలు వైకాపా నేతలతో కలిసి ఢిల్లీలో రామ్‌మాధవ్ నివాసానికి వెళ్లినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని బీజేపీ నేతలకు వైకాపా నేతలు అందించారన్నారు. రాజ్యాంగ విలువలు పాటించని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభ పీఏసీ చైర్మన్‌గా అనర్హుడన్నారు. శనివారం కనకమేడల విలేఖరులతో మాట్లాడుతూ వైకాపా నేతలు బీజేపీ నేతలను ఢిల్లీలో కలిసిన విషయం సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ, వారు ఒప్పుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ వాహనం లాగ్ రిజిస్టర్లలో కూడా నమోదయిందన్నారు. అయితే తమ తప్పను కప్పిపుచ్చుకునేందుకు వైకాపా, బీజేపీ నేతలు తప్పడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వైకాపా నేతలు బీజేపీ నేత రామ్ మాధవ్ ఇంటికి వెళ్లిన విషయాన్ని బయటకు రాకుండా ఎందుకు ఉంచారో చెప్పాలన్నారు. అయితే రిజిష్టర్‌లో నమోదయిన విషయంపై బీజేపీ, వైకాపా నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రత్యర్థులను పిలిపించుకుని రాష్ట్ర ప్రభుత్వంపైనా, మాపైనా దాడి చేయాలనే ఉద్దేశంతోనే ఏపీ బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీకి వెళ్తున్నట్లు వివరించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తప్పుఒప్పుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముసుగులు తొలగించి పొత్తు పెట్టుకుంటే టీడీపీకి అభ్యంతరం లేదన్నారు. ఎన్డీయే నుండి టీడీపీ బయటకు రావాలని చెప్పిన వైకాపా ఇప్పుడు వారితో లోపాయికారీగా కలుస్తోందన్నారు.