ఆంధ్రప్రదేశ్‌

దేవాలయాల్లో రెండోరోజుకు క్షురకుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: కనీస వేతనం 15వేలు, ఉద్యోగ భద్రత వంటి అపరిష్కృత డిమాండ్ల సాధనకై రాష్ట్రంలో తిరుమల మినహా ఇతర దేవాలయాలన్నింటా దాదాపు 2500 మంది క్షురకులు సాగిస్తున్న నిరవధిక సమ్మె శనివారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా విజయవాడ, ఇతర నగరాల్లో క్షురకులు ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. దుర్గగుడి కేశఖండనశాలలో క్షురకులు తెల్లవారుజాము నాలుగు గంటలకు విధులకు హాజరై ‘కత్తి’ డౌన్ చేశారు. అయితే ప్రభుత్వ క్షురకులు నలుగురు మాత్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు నెలకు 15వేలు కనీస వేతనం, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, ఉద్యోగ విరమణ చేసిన వారికి ఐదువేల రూపాయల పెన్షన్ చెల్లించాలంటూ నినదించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి హామీ ఇచ్చిన విధంగా 18 తేదీ తమతో చర్చలు జరిపి పరిష్కారం చూపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. దుర్గగుడితోపాటు రాష్ట్రంలో పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, శ్రీశైలం, మోపిదేవి తదితర పెద్ద ఆలయాల్లో సైతం తమ ఆందోళన కొనసాగుతున్నదన్నారు.