ఆంధ్రప్రదేశ్‌

వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 16: ముక్కుపచ్చలారని ఆరేళ్ళ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దుర్ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఊగిసలాడుతూ తుదిశ్వాస విడిచాడు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో వాసంశెట్టి నాగేంద్ర (6) మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందినట్టు తెలిసి నగరంలో కలకలం చెలరేగింది. నగరంలోని బాలాజీచెరువు ప్రాంతంలో నివసిస్తోన్న ఆటో డ్రైవర్ వాసంశెట్టి శ్రీనివాస్, తల్లి భూలక్ష్మి లేని సమయంలో ఇంటి ఆవరణలో నాగేంద్ర ఆడుకుంటుండగా పరిసరాల్లో సంచరించే మూడు వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో బాలుడి శరీరాన్ని తీవ్రంగా కరిచాయి. బాలుడి ఆర్తనాదాలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోగా బాలుడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించారు. మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.