ఆంధ్రప్రదేశ్‌

మండుతున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 16: రాష్ట్రంలో భానుడు భగభగ మంటున్నాడు. గత మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించి నమోదవుతున్నాయి. వేసవి వెళ్లి, నైరుతి సానుకూలంగా ఉందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజానీకం విలవిల్లాడుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. విశాఖ నగరంలో శనివారం పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 6 డిగ్రీలు అధికంగా నమోదైంది. దీంతో పగటి పూట వేడిగాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక రాష్ట్రంలోని పలు పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖపట్నం, మచిలీపట్నం, గన్నవరం, బాపట్ల, కావలి, ఒంగోలు, తిరుపతి 40ల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటిలో విశాఖ సాధారణం కంటే 6 డిగ్రీలు అధికం కాగా, మచిలీపట్నం 4 డిగ్రీలు, గన్నవరం, బాపట్ల, కావలి పట్టణాల్లో 3 డిగ్రీలు అధికం. కాకినాడ, తుని పట్టణాల్లో సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నర్సాపూర్ 38, కర్నూలు 37 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు.