ఆంధ్రప్రదేశ్‌

40 హిందూ సంస్థలతో జేఏసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: రాష్ట్రంలోని 49 హిందూ సంస్థలతో హిందూ జేఏసీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా తాళ్లాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని హిందూ సంస్థలతో కలిసి హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు జేఏసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 40 హిందూ సంస్థల ప్రతినిధులు జేఏసీలో సభ్యులుగా చేరారని చెప్పారు. హిందూ సమాజంపై ఏ విధమైన దాడులు జరిగినా జేఏసీ రక్షగా, అండగా ఉంటుందని తెలియజేశారు. శివశక్తి సంస్థ కరుణాకర్ మాట్లాడుతూ దేశంలో అన్ని మతాలు సమానమే కావచ్చు కానీ కొన్ని మత సంస్థలు దేవాలయ వ్యవస్థను రూపుమాపే విధంగా నడుచుకోవటం వల్ల హిందూ ధార్మిక సంస్థలు ఇబ్బందులకు లోనవుతున్నాయన్నారు. మరికొందరు హిందువులపై దాడులకు తెగపడుతున్నారని, వాటిని నిరోధించేందుకు హిందూ జేఏసీ పనిచేస్తుందని తెలిపారు. దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా పరిగణిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మత మార్పిడి విధానాన్ని ప్రోత్సహించే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.