ఆంధ్రప్రదేశ్‌

80 ఏళ్ల వయస్సులో ఇంటర్నేషనల్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 16: హింది పండిట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కమలమ్మ (80)కు వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు లభించింది. ఆసంస్థ ఇండియా చీఫ్ కో ఆర్డినేటర్ భంగి నరేంద్రగౌడ్, సౌత్ చీఫ్ కో ఆర్డినేటర్ గుర్రం స్వర్ణశ్రీ చేతులు మీదుగా శనివారం తిరుచానూరులో ఈ అవార్డును అందజేశారు. 80 ఏళ్ల వయస్సులో కమలమ్మ ఏం సాధించడంతో ఈ అవార్డు వచ్చిందనుకుంటున్నారా.. గత 42 సంవత్సరాలుగా ఆమెకున్న అభిరుచే ఆమెకు నేడు ఈ అవార్డును తెచ్చిపెట్టింది. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు, ఆంగ్ల,హింది పత్రికల్లో వచ్చిన ఆధ్యాత్మికం,క్రీడలు, విద్య, మహిళ, చిన్నారులకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన పేపర్ కటింగ్‌లు సేకరించింది. ఇలా దాదాపు 11వేల న్యూస్ పేపర్ల కలెక్షన్లు ఆమె సేకరించారు. వాటిని బైండింగ్ చేయించారు. అలాగే తన స్వీయ ఆలోచనలతో 10 మంది ద్వారా తెలుసుకున్న మంచి కొటేషన్‌లను ఇప్పటి వరకు 24,088 రాసి వాటిని బైండింగ్ చేయించారు. అలాగే 8800మంది ప్రముఖ విద్యా వేత్తలు, మేధావులు, తత్వవేత్తలు,సామాజిక వేత్తలు వెలువరించిన కొటేషన్లను పుస్తకంలో అతికించి భద్రపరిచారు. అంతేకాదు 3వేలకు పైగా చందమామ, బాలమిత్ర, స్వాతి వంటి పుస్తకాల్లో వచ్చిన చిన్న పిల్లల కథలు, ఆసక్తిని పెంచే సృజనాత్మక వ్యాసాలను బైండింగ్ చేయించి దాచి ఉంచారు. తన 41 ఏళ్లలో కమలమ్మ 45,888 వ్యాసాలు,కొటేషన్లు సేకరించారు. తిరుచానూరు రోడ్డులోని పడమర వీధిలో ఉన్న శ్రీపద్మావతి ధ్యాన మందిరంలో ఆమె కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ అవార్డును అందుకున్న సందర్భంగా కమలమ్మ మాట్లాడుతూ తాను పాఠశాల టీచర్‌గా ఎదిగి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని తాపత్రయ పడ్డానన్నారు. అలాగే తనకు అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.