ఆంధ్రప్రదేశ్‌

ఆదోనిలో వెలసిన చాపమ్మ అవ్వ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జూన్ 16: కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లో మహిమలు చూపుతూ చాపమ్మ అవ్వ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో చాపమ్మ అవ్వ దర్శనం కోసం చిన్నాపెద్ద అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరు బారులుతీరుతున్నారు. గతంలో ఆదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ తన మహిమలు చూపి జీవ సమాధి అయ్యారు. ఆమెకు భక్తులు దేవాలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. ఆ తరువాత కరిడిగుడ్డం గ్రామంలో మంగమ్మ అవ్వను భక్తులు కొలిచారు. అక్కడా ఆమెకు దేవాలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. తాజాగా చాపమ్మ అవ్వ దర్శనానికి బారులుతీరుతున్నారు. 20 ఏళ్ల క్రితం చాపమ్మ అవ్వ కౌతాళం మండలంలో ఒంటరిగా తిరుగుతుండేది. ఎవరైనా దగ్గరికి వస్తే బెదిరించేది. చాపమ్మ అవ్వ మహిమ గలదని భావించి ఆమె ఉన్న చోటు వెతుక్కుంటూ వెళ్లేవారు. అయితే చాపమ్మ అవ్వ ఎవ్వరినీ దగ్గరకి రానిచ్చేది కాదు. రాళ్లు, కర్రతో దగ్గరికి వచ్చే వారిని కొట్టేది. అయినా భక్తులు ఆమె దర్శనం కోసం వచ్చేవారు. కాలక్రమంలో చాపమ్మ అవ్వను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చాపమ్మ అవ్వ భక్తుడు. ఇటీవల బాపురం గ్రామానికి చెందిన సిద్దారెడ్డి చాపమ్మ అవ్వ కోసం తన పొలంలో ప్రత్యేకంగా ఆశ్రమం నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో భక్తులు ఆశ్రమానికి చేరుకుని అవ్వను సేవించుకునేవారు దీంతో ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడేది. ఇటీవల ఆమె కుమారులు కర్నాటకలోని కాట్రికి తీసుకువెళ్ళారు. అయినప్పటికీ అవ్వ దర్శనం కోసం ఆదోని, కౌతాళం, మంత్రాలయం తదితర ప్రాంతాల నుంచి భక్తులు కాట్రికి వెళ్లేవారు. ఇటీవల అవ్వ ఆదోని సమీపంలోని అలీపురం తాత మఠానికి వచ్చి పూజల్లో పాల్గొంది. అవ్వ వస్తున్నట్లు తెలుసుకున్న భక్తులు దర్శనం కోసం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. తాజాగా శనివారం చాపమ్మ అవ్వను బంధువులు అల్లీపురం తాత మఠానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అవ్వను తన ఇంటికి ఆహ్వానించి సేవించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తావని, ఆదోనిలో ఒక వెలుగు వెలుగుతావని చాపమ్మ అవ్వ ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. చాపమ్మ అవ్వ దర్శనం కోసం భక్తులు బారులుతీరారు. అవ్వ ఆశీర్వాదం ఇస్తే చాలు అని భక్తులు అంటున్నారు. చాపమ్మ అవ్వ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. పండ్లు, ఇతర తిను బండారాలు ఇస్తే కొంచెం తిని భక్తులకు తిరిగి ఇస్తుంటారు. దానే్న మహాప్రసాదంగా భక్తులు భావిస్తుంటారు. తాము తెచ్చిన పండ్లు, వస్తువులను అవ్వ తిన్నా, ముట్టినా తమ కోర్కెలు తీరినట్లేనని భక్తులు భావిస్తున్నారు. అవ్వ దర్శనం కోసం తరలివస్తున్నారు.
చిత్రం.. ఆదోనిలో చాపమ్మ అవ్వ ఆశీస్సులు తీసుకుంటున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి