ఆంధ్రప్రదేశ్‌

జగన్, పవన్‌లను బీజేపీ ఆడిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 16: అవినీతి ఆరోపణల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన సుమారు 43 వేల కోట్ల అక్రమార్జనకు సంబంధించి సమాధానం చెప్పాలని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం చినరాజప్ప విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి దిశగా సాగిపోతోందని, ఇది చూసి ఓర్వలేక కేంద్రం అడుగడుగునా అడ్డు తగులుతోందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సకాలంలో పూర్తిచేసి రాయలసీమకు నీరందించామన్నారు. అమరావతి నిర్మాణాన్నీ శరవేగంగా పూర్తిచేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత జగన్ ఆరోపణలు ఎంతమాత్రం సరికాదన్నారు. పోలవరం సినిమా అంటూ జగన్ వ్యాఖ్యానించి రాష్ట్ర ప్రజలను అవహేళనకు గురిచేశారని పేర్కొన్నారు. కేంద్రానికి ఎదురొడ్డి పలు రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. వైసీపీ, జనసేన పార్టీల అధినేతలు జగన్, పవన్‌లు రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వీరిద్దర్నీ బీజేపీ ఆడిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు ఆరోపణలు చేస్తున్న జగన్ కారణంగా ఎందరో మంత్రులు, ఐఏఎస్‌లు, ఉన్నతస్థాయి అధికారులూ జైలుపాలయ్యారన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో చంద్రబాబుపై జగన్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారా? అన్న ప్రశ్నకు సకాలంలోనే స్పందిస్తున్నామని చినరాజప్ప వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 29న రాజమహేంద్రవరంలో టీడీపీ ధర్మ పోరాట దీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు. దీక్షలో కేంద్ర ప్రభుత్వ అనుచిత వైఖరిని ఎండగడతామని స్పష్టం చేశారు. దీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారన్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై సాగిస్తున్న నిరంకుశ ధోరణిని ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు. ఈ నెల 22న ధర్మపోరాట దీక్షపై రాజమహేంద్రవరంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌కు 2014లో బుద్ధి చెప్పినట్టే, 2019లో బీజేపీకీ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చినరాజప్ప అభిప్రాయపడ్డారు.