ఆంధ్రప్రదేశ్‌

ముస్లింల అభివృద్ధి, భద్రతకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: శనివారం ఉదయం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన రంజాన్ సామూహిక ప్రార్థనల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి ముస్లిం సోదరులతో కలిసి సామూహిక నమాజ్‌లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రంజాన్ మాసంలో నెల రోజులపాటు ఉపవాసం ఉండి సమాజంలో శాంతికి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండటానికి రంజాన్ మాసంలో మీరు చేసే దీక్షలు ఎంతో పవిత్రమైనవన్నారు. కఠోర దీక్షని నెలరోజులపాటు ఆచరించటం ఎంతో మంచిదన్నారు. ఈ నెల రోజులపాటు ఉపవాస దీక్షలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండటానికి అల్లాని ప్రార్థిస్తారన్నారు. నూతన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి, రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండటానికి మీరు ప్రార్థించాలన్నారు. సమాజంలో భద్రత ముఖ్యమని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.1100 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి ముస్లిం కుటుంబం ఆనందంతో రంజాన్ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో 12 లక్షల కుటుంబాలకు రూ.65 కోట్లతో రంజాన్ తోఫాను అందించామన్నారు. అదే విధంగా సంక్రాంతి పండక్కి కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అందిస్తున్నామన్నారు. మైనార్టీ యువతులకు దుల్హన్ పథకం కింద ఒక్కొక్క యువతికి పెండ్లి కానుకగా 50వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఇమామ్‌లకు రూ.5వేలు, వౌజమ్‌లకు రూ.3వేలు గౌరవ పారితోషికాన్ని అందిస్తున్నామన్నారు. తెలంగాణలో 1500 రూపాయలు, హర్యానా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ గౌరవ వేతనంగా అందిస్తున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉర్దూకు రెండవ అధికార భాషగా గుర్తింపు కల్పించామని, హైదరాబాద్‌లో హజ్ హౌస్ నిర్మించామన్నారు. ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కడపలో 12 కోట్లతో, విజయవాడలో 80 కోట్లతో హజ్ హౌస్‌లు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచే హజ్ యాత్రికులు మక్కా వెళ్లే విధంగా చర్యలు చేపడతామన్నారు. షాదీఖానాలు, మసీదుల మరమ్మతులకు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రాధాన్యతను కల్పిస్తున్నామన్నారు. త్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ప్రాసిక్యూషన్ చేస్తామంటే మొదటిగా తామే అభ్యంతరాలు తెలిపామన్నారు. తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చకు పంపించారన్నారు. ముస్లిం సమాజం అభివృద్ధికి, భద్రతకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు విద్యా రంగంలో మరింత రాణించేందుకు వారి కోసం త్వరలోనే 25 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో వారు విద్యాపరంగా ఇంకా ముందుకు వెళ్లటానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. సామూహిక రంజాన్ ప్రార్ధనల్లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌రావు, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ నాగుల్‌మీరా, జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ముస్లిం పెద్దలు హఫీజ్ ఇలియాజ్, జనాబ్ రహీర్ అహ్మద్‌లు, ముస్లిం ఈద్గా కమిటీ, ముస్లిం అభివృద్ధి కమిటీ సభ్యులు, ముస్లింలు పెద్దఎత్తున పాల్గొన్నారు. నమాజ్‌ను నసీమ్ అహ్మద్ ముఫ్తీ నిర్వహించారు.

చిత్రం..రంజాన్ ప్రార్థనల అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు