ఆంధ్రప్రదేశ్‌

భానుడి భగభగలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 17: రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ఉదయం ఏడు గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రంలో అనేక చోట్ల 33 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన మూడు రోజులుగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద 41.4 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గడచిన పదేళ్ళలో విశాఖలో ఇంతగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం. మచిలీపట్నంలో 40.8, కావలి, కాకినాడల్లో 40.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుని, నెల్లూరుల్లో 40, రెంటచింతలలో 40.2, బాపట్లలో 40.3, ఒంగోలులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఇవి సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీలు అధికమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో జిల్లాల్లో వడగాడ్పులు వీయడంతో జనం అల్లాడిపోయారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం ఆరు గంటలకు కూడా వాతావరణం చల్లబడకపోవడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కాగా, ఈ ఉష్ణోగ్రతలు మరో ఐదు, ఆరు రోజులు ఇలానే ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, నైరుతి రుతుపవనాలు మందగమనంతో ఉండడం వలన ఆశించిన వర్షాలు కురియడం లేదు. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం విశాఖ, శ్రీకాకుళం, నర్సాపూర్, నెల్లూరు జిల్లాల్లో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. విశాఖలోని కొన్ని ప్రదేశాల్లో భీకర గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో జనం భయభ్రాంతులయ్యారు.