ఆంధ్రప్రదేశ్‌

పోలవరం దగ్గరే మకాం పెట్టి పనులు పరిశీలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: పోలవరం ప్రాజెక్టు స్థలంలోనే మకాం వేసి పనులను పర్యవేక్షించవచ్చునని బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అవినీతి అంటూ అనుమానాలు పెంచి పోలవరాన్ని బలిపశువు చేసేందుకు బీజేపీ నేతలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో గురువారం టీడీపీ వర్క్‌షాపు జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నా, 57 శాతం మేర పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేశామని సీఎం వెల్లడించారు. ఇంకా 2250 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. డీపీఆర్-2ను కేంద్రానికి పంపి ఏడాది అయిందని, ఇంకా కొర్రీలు వేస్తున్నారన్నారు. బుధవారం నాటి కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటనలో కూడా ఇదే చెప్పానన్నారు. అవసరమైతే ఢిల్లీకి సెక్రటేరియట్‌ను తీసుకువస్తానని చెప్పానన్నారు. పోలవరం ప్రాజెక్టులో ముంపు భూమి విస్తీర్ణం పెరిగిందని, భూమి విలువ పెరిగిందని అనుమానాలు రేకెత్తేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. కొత్త చట్టం కారణంగా భూమి విలువ పెరిగిందని వివరించారు. పోలవరం పనులన్నీ అవసరమైతే జియో ట్యాగింగ్ చేస్తామని, కావాలంటే అక్కడే మకాం వేసి పర్యవేక్షించవచ్చుని వ్యాఖ్యానించారు. అవినీతి అనుమానాలు పెంచి పోలవరాన్ని బలిపశువును చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. అవినీతి పరులతో బీజేపీ సావాసం చేస్తోందని, పోలవరం పూర్తి కాకుండా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని కొందరు పని చేస్తున్నారన్నారు. ప్రతివారం కోర్టుకు వెళ్లే వ్యక్తి టీడీపీని, తనను విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. అమరావతి అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతూ, ఏపీ ఇమేజ్‌ని అంతర్జాతీయంగా, జాతీయంగా దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మూడు పార్టీలు మాట్లాడుకుని, మూకుమ్మడిగా టీడీపీనే టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. దొంగే.. దొంగ దొంగ అని అరచి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. అనివీతి కేసుల్లోని నిందితులపై సంవత్సరంలోగా చర్యలు తీసుకుంటామని, నల్లధనాన్ని విదేశాల నుంచి తెప్పించి, ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని మాట తప్పారని ఎద్దేవా చేశారు. అన్ని విషయాల్లో బీజేపీ విఫలమైందని, అన్ని వర్గాల ప్రజలకు దూరమైందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా తమ డబ్బులేనని, బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ అవి ప్రజల డబ్బులన్నారు. సమర్థంగా పని చేస్తూ నిధులు తెచ్చుకుంటున్నామన్నారు. గత నాలుగేళ్లలో పెరిగిన ఇన్‌పుట్స్ ధరలతో పోలిస్తే, పెంచిన కనీస మద్దతు ధర వల్ల ఒరిగేదేమీ లేదని ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గినా, దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు పెంచుతున్నారన్నారు. ఏటీఎంలో డబ్బు లేకుండా చేశారని, రూపాయి విలువ గణనీయంగా తగ్గిపోతున్నా, చోద్యం చూస్తున్నారని విమర్శించారు. 70 వేల కోట్ల రూపాయలు ఏపీకి రావాల్సి ఉందని ప్రకటించిన పవన్ తన యాత్రల్లో దాని గురించి ఎందుకు ప్రస్తావించరని ప్రశ్నించారు. ఒకాయనకు దొంగ లెక్కలు రాయడంలో, మరోకరికి సినిమాల్లో తప్ప రాజకీయాల్లో, పాలనలో ఏం అనుభవం ఉందని ప్రశ్నించారు. జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదని, ఇప్పుడు ఏపీలో జరిగేది జమిలేనని తెలిపారు. అయతే వారి రాజకీయ లాభాల కోసం ఎన్నికలు జరుపుతామంటే అంగీకరించమన్నారు. బీజేపీ ఏది చెబితే దానికి వైకాపా తందాన అంటోందని ఆరోపించారు. రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతామని జమిలి ఎన్నికలు తెద్దామని ఆలోచిస్తున్నారన్నారు. రాజకీయ స్వార్థాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నాయకుడికి ప్రజామోదం, కార్యకర్తల్లో విశ్వాసం ఉంటే ఎన్నికలు ఏకపక్షం అవుతాయన్నారు. గ్రూపు విభేదాలు మానుకోవాలన్నారు.