ఆంధ్రప్రదేశ్‌

తెలుగు ప్రాధికార సంస్థకు చట్టబద్ధత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ (తెలుగు డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులనిచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తెలుగు భాషోద్యమ సంస్థ అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్‌బాబు ధన్యవాదాలు తెలిపారు. సరిగ్గా రెండేళ్ల క్రిందట తమ విన్నపాన్ని మన్నించి ఇందుకోసం కమిటీని నియమించి, ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి నెరవేర్చుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఈ ఉత్తర్వులు కూడా వివరంగా సమగ్రంగా ఉన్నాయన్నారు. అయితే గతేడాది తెలుగు భాషాదినోత్సవం నాడు ముఖ్యమంత్రి ప్రకటించినట్లు రానున్న శాసనసభ సమావేశాలల్లో దీనికి ఒక చట్టరూపం కన్పించేందుకు బిల్లును ప్రవేశపెట్టాలని, చట్టంగా వచ్చినప్పుడే దీని లక్ష్యం నెరవేరుతుందన్నారు. తెలుగు భాష అమలుకోసం సరైన చర్యలను తీసుకున్నందుకు ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూ ఈ నెల 29న తెలుగు భాషాదినోత్సవం నాడు ఈ ప్రాధికార సంస్థను నెలకొల్పాలని డాక్టర్ సామల విజ్ఞప్తి చేశారు.