ఆంధ్రప్రదేశ్‌

మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం కాల పరిమితి పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులకు వర్తిస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం కాల పరిమితిని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో నెం 291ను గురువారం జారీ చేసింది. వాస్తవానికి ఏడాది క్రితమే హెల్త్ స్కీం అమల్లోకి వచ్చినప్పటికీ పలు ఆసుపత్రుల్లో సక్రమంగా అమలు కాకపోవటంతో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఆగస్టు ఒకటో తేదీ నుంచి 204 వ్యాధులకు సంబంధించిన చికిత్సల సౌకర్యాన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్ నుంచి తొలగించి ఎంప్లారుూస్ హెల్త్ స్కీంలో కొనసాగించబోతున్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ కాలపరిమితి పొడిగింపు పట్ల ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ టీవీ ఫణి పేర్రాజు, కృష్ణా చైర్మన్ డీ ఈశ్వర్, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, అధ్యక్షులు కే శివశంకరరెడ్డి, యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జీ, ప్రధాన కార్యదర్శి పీ బాబురెడ్డి వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. ఎంప్లారుూస్ హెల్త్ స్కీంలో ఉన్న అన్ని చికిత్సలకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.