ఆంధ్రప్రదేశ్‌

కెరీర్‌కు ఉపకరించేలా చదువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: నాలుగేళ్ల కళాశాల చదువు ఆ తరువాత నలభై ఏళ్ల కెరీర్‌కు ఏ విధంగా ఉపకరిస్తుందో మేధోమథనం చేసి ప్రభుత్వానికి తగు సూచనలు ఇవ్వాలని వివిధ వర్సిటీల వైస్‌చాన్సలర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలోని వివిధ వర్సిటీల వీసీలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీని వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దే కృషిలో భాగస్వాములు కావాలన్నారు. వర్సిటీల్లో పుస్తకాల్లో బోధించే సిద్ధాంతాలకు, వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆలోచనలకు, ఆచరణకు మధ్య దూరం పెరిగేలా విద్యా విధానం కొనసాగుతుండటం అన్నింటి కంటే దురదృష్టకరమన్నారు. ఐఐటి, నిట్ వంటి పోటీ పరీక్షల్లో ఏపీ విద్యార్థులు అగ్రభాగాన నిలిచారని, సాధించిన విజయాలను చాటుకోవడం ద్వారా మరింత మందిలో సానుకూల దృక్పథం ఏర్పడుతుందన్నారు. వివిధ అంచెల్లో నడుస్తున్న విద్యా సంస్థలన్నింటినీ ఒకదానికొకటి అనుసంధానం చేసేలా మార్పులు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. వర్సిటీలు డిగ్రీ కళాశాలలతో, డిగ్రీ కళాశాలలు జూనియర్ కళాశాలలతో, జూనియర్ కళాశాలలను ఉన్నత పాఠశాలలతో, ఉన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేస్తామన్నారు. ఫలితంగా మార్గదర్శనం చేసే వీలు కలుగుతుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు గడిచిందని, ఏయే రంగాల్లో ఎక్కడ ఉన్నామో సమీక్షించుకుంటున్నామన్నారు. అన్ని రంగాలకు పునాదిగా నిలిచే విద్యా రంగంపై సమగ్ర దృష్టి పెట్టామని, విద్యా రంగంలో ప్రపంచ గమ్యంగా ఏపీగా మారాలన్నారు. ఈ రంగంలో ఏపీ చేస్తున్న కృషిని గుర్తించి సహకరించేందుకు వివిధ ప్రపంచ శ్రేణి వర్సిటీలు ముందుకు వచ్చాయని తెలిపారు. మనతో కలిసి పని చేసేందుకు యునెస్కో కూడా ఆసక్తి చూపుతోందన్నారు. ప్రతి వర్సిటీని నాలుగైన పరిశ్రమలకు అనుసంధానం ఇక తప్పనిసరిగా జరగాలన్నారు. చదువుకుంటూ పని చేసే అవకాశాలు కల్పిస్తూ, ప్రతి విద్యార్థిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధానాలు తీసుకురావాలన్నదే తమ సంకల్పమంటూ దిశానిర్దేశం చేశారు. విద్యార్థి దశలో పరిశోధనల వల్ల వారి కెరీర్‌కే కాకుండా సమాజానికి ఉపకరిస్తుందన్నారు. ఆహార, ఆతిథ్య రంగాల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులవైపు మళ్లాలని సూచించారు. నారుమళ్లు వేయడం, పాలు పితకడం వంటివి పర్యాటకంలో చేరి పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయన్నారు. చిన్నచిన్న ఆలోచనలే పెను మార్పులకు దోహదపడతాయన్నారు.