ఆంధ్రప్రదేశ్‌

ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: సమష్టిగా పని చేస్తూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు సహకరిస్తున్నారని, భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పని చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్‌లో మొదటి స్థానం దక్కడంపై కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రిని కలిసి అభినందించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఈ గుర్తింపు లభించడంలో అధికారుల కృషి మరువలేనిదన్నారు. సీఎం ఆలోచనలకు తగినట్లుగా పని చేస్తూ పారిశ్రామిక ప్రగతికి సహకరించారన్నారు. ఇదే స్ఫూర్తితో ఏపీని అగ్రపథాన నిలిపేందుకు సహకరించాలని కోరారు.

చిత్రం..మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని అభినందిస్తున్న అధికారులు