ఆంధ్రప్రదేశ్‌

టీడీపీని చూస్తే ప్రతిపక్షాలకు భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రిని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల ఎద్దేవా చేశారు. ఉండవల్లిలో గురువారం జరిగిన టీడీపీ వర్కుషాపులో ఆయన మాట్లాడుతూ ఏదోరకంగా టీడీపీని దెబ్బతీయాలని ఆనాడు కాంగ్రెస్ పని చేసిందని, ఇప్పుడు బీజేపీ అదే పని చేస్తోందని ఆరోపించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, హ్యాపీనెస్‌లో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉన్నామని, చెప్పినవన్నీ చేయడం వల్లే ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోందన్నారు. చంద్రబాబు పనితనాన్ని, ఆయనపై ఉన్న నమ్మకాన్ని చూసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. జగన్, పవన్ అధికారం కోసమే యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకు జీఎస్టీ తీసుకువచ్చారని, ఇప్పుడు జమిలి ఎన్నికలు తెస్తామంటున్నారన్నారు.

చిత్రం..టీడీపీ వర్క్‌పాప్‌లో మాట్లాడుతున్న మంత్రి యనమల రామకృష్ణుడు