ఆంధ్రప్రదేశ్‌

గతం కన్నా పోరాటం ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో గతంలో కన్నా పోరాటం మరింత ఉద్ధృతంగా చేయాలని టీడీపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలతో గురువారం రాత్రి ఆయన చర్చించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్రంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీవ్రతరం చేయాలన్నారు. శుక్రవారం నుంచి ఢిల్లీలోని మిగిలిన ప్రతిపక్ష నేతలను కలవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల మద్దతు కోరాలని సూచించారు. తాను ఫోన్లు చేసి ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతానని, సంఘీభావం కోరతానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయేది ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ అని, అందులో మనకు పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. గత సమావేశాలకు భిన్నంగా ఈ పోరాటాలు ఉండాలని, ప్రజల దృష్టి ఎంపీల పోరాటంపైనే ఉందన్నారు. అందుకు తగ్గట్లుగా ఎంపీలు పోరాడాలని సూచించారు. రాష్ట్రం కోసం మన ఎంపీలు పోరాడారాన్న ప్రశంసలు ప్రజల నుంచి రావాలన్నారు. పార్లమెంట్ వేదికగా రాజీలేని పోరాటం చేయాలని, సమావేశాలు పూర్తి కాగానే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఎందుకు తమకీ అన్యాయమని, ఇప్పుడు మీరు చేస్తున్న అన్యాయం మాట ఏమిటని ప్రశ్నించారు. చట్టంలో ఉన్నవాటిని ఎందుకు నెరవేర్చరని, పార్లమెంట్ వేదికగా జవాబివ్వాలని డిమాండ్ చేశారు. పోరాట స్ఫూర్తే టీడీపీకి ప్రజల్లో ఉన్న ఇమేజ్ అని తెలిపారు. సభ నిర్వహణలో వైఫల్యం కేంద్రం వైఫల్యమేనని స్పష్టం చేశారు. వైకాపా ఎంపీల రాజీనామాల వల్ల బీజేపీకి మేలు జరిగిందన్నారు. సభ్యుల సంఖ్య తగ్గడం వల్ల మైనారిటీలో పడే ప్రమాదం నుంచి బయటపడిందన్నారు. అందుకే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. బీజేపీ నేతలు ఆమోదించారన్నారు.