ఆంధ్రప్రదేశ్‌

ఇంత నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ఎవరితోనూ సంప్రదించకుండా యూపీఏ ఏకపక్షంగా వ్యవహరించింది. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలను బీజేపీ కాలరాస్తోంది. ఏపీపై ఇంత నిర్లక్ష్యమా? మాకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నాం. గత నాలుగేళ్లుగా కేంద్రం ఏం ఇచ్చిందీ, ఇవ్వాల్సిందీ వివరాలివిగో.. ఓ రాజకీయ పార్టీగా మీరు ఆలోచించి మద్దతివ్వండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రకటించే అవిశ్వాసానికి మద్దతు కోరుతూ ఆదివారం పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు, ముఖ్యమంత్రులకు ఆయన రాసిన 8 పేజీల లేఖ పూర్తిపాఠం ఇలా ఉంది.
‘విభజన సందర్భంగా 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదు. అశాస్ర్తియ పద్ధతిలో విభజన జరిగింది. ఏకపక్షంగా తలుపులు మూసేసి బిల్లును ఆమోదించారు. విభజన చట్టం 11వ యాక్టులో 8వ షెడ్యూల్ ప్రకారం రాజ్యసభలో ఆరు ప్రధానమైన హామీలు ఇచ్చారు. ఇవి అమలు చేయటంలో కూడా కేంద్రంలోని బీజేపీ తాత్సారం చేస్తోంది’ అని ఆయన ఆరోపించారు. షెడ్యూల్ 8 ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టు, గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ అయిల్ రిఫైనరీ - పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ, విజయవాడ విమానాశ్రయాల విస్తరణ, తిరుపతికి అంతర్జాతీయ స్థాయి కల్పించటంతో పాటు నూతన రాజధాని నుంచి హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు రైల్, రోడ్డు రవాణా అనుసంధానం, ప్రత్యేక రైల్వే జోన్, విశాఖపట్నం, విజయవాడ మెట్రోరైలు సదుపాయాలు కల్పించాల్సి ఉంది. షెడ్యూల్ 9 ప్రకారం 89 స్థిర, చరాస్తులు, షెడ్యూల్ 10 ప్రకారం 142 జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సంబంధించి ఇప్పటికీ పంపకాలు జరగలేదు. రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఆరు ప్రధాన హామీలకు సభలో ఉన్న పార్టీలే సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ప్రత్యేక హోదా ప్రకటించారు. ఈ అంశాన్ని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సీమాంధ్ర ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చిందని ఆయన వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరుపతి, నెల్లూరు బహిరంగ సభల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వీటిని నెరవేరుస్తామని, పదేళ్లు ప్రత్యేక హోదా ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్నోసార్లు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులకు తమ పార్టీ ఎంపీలు కలిసి విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరించి అన్యాయం చేశారని, ఈ పరిస్థితుల్లోనే తాము ఎన్డీఏ నుంచి వైదొలగామని తెలిపారు. ‘కేంద్ర వైఖరిని నిరసిస్తూ గత సమావేశాల సందర్భంగా అవిశ్వాసం ప్రకటించాం. అయితే చర్చకు రానివ్వకుండా వాయిదా వేసింది. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ మరోసారి అవిశ్వాసానికి సిద్ధమవుతున్నాం. వాస్తవాలు గ్రహించి సహకరించండ’ని విజ్ఞప్తి చేశారు. ఇంకా లేఖలో విభజన నాటి పరిణామాలను వివరించారు. ఆస్తుల పంపకాల్లో ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నారని, అప్పులు మాత్రం జనాభా దామాషా ప్రకారం లెక్కగట్టి మోసం చేశారని ధ్వజమెత్తారు. పన్నుల వసూళ్లలో జరిగిన అన్యాయానికి ప్రతిఫలంగా రూ. 3వేల 800 కోట్ల మేర మేం నష్టపోయాం. విభజన చట్టంలోని 9 షెడ్యూల్ ప్రకారం సింగరేణి కాలరీస్‌లో ఉన్న ఈక్విటీ పంపకాలు జరగలేదు. విద్యుత్ వినియోగం ఆధారంగా కేటాయింపులు జరిపారు. ప్రధానమైన ఆరు అంశాల్లో నాలుగు అంశాలు పూర్తిస్థాయిలో అమలుకాలేదు. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్, శాసనసభ సీట్ల పెంపుపై కేంద్రం స్పందించటం లేదని ఆరోపించారు. షెడ్యూల్ 8 ప్రకారం 11 జాతీయ విద్యాసంస్థలకు గాను 9 ఏర్పాటయ్యాయని, వీటి నిర్వహణకు రూ. 11వేల 673 కోట్ల నిధులు అంచనావేస్తే కేవలం రూ. 638.19 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ఈ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11వేల 714 కోట్ల విలువైన 2911.52 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, వీటికి రూ. 131.33 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని వివరించారు. 9వ షెడ్యూల్ ప్రకారం 89 సంస్థలకు గాను 41 సంస్థలకు సంబంధించి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించినా ఇప్పటికీ పంపకాలు జరగలేదన్నారు. టెన్త్ షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థలో ఒక్కటి కూడా రాష్ట్రంలో ఏర్పాటు కాలేదన్నారు. సెక్షన్ 66 ప్రకారం ఢిల్లీలో ఏపీభవన్ సమస్యను సత్వరమే పరిష్కరించాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి రూ. 16వేల 200 కోట్ల రెవిన్యూ లోటు భర్తీచేస్తామని ఇచ్చిన హామీ కూడా అటకెక్కించారని ధ్వజమెత్తారు. ‘ఈ పరిస్థితుల్లో విశ్వసనీయతే పెట్టుబడిగా రాజధాని కోసం 33వేల 500 ఎకరాల భూ సమీకరణ జరిపాం. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 15వందల కోట్లు మాత్రమే కేంద్రం విదిల్చింది. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అమానుషంగా వ్యవహరిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా పార్టీల మద్దతుతో న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మీ సంఘీభావం ప్రకటించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో కోరారు.