ఆంధ్రప్రదేశ్‌

కేఎల్ రావు సేవలు మరువలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 15: సుప్రసిద్ధ ఇంజనీరు డాక్టర్ కేఎల్ రావు అందించిన సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్లాఘించారు. ఆదివారం కేఎల్ రావు జయంతి సందర్భంగా చంద్రబాబు ఇక్కడ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. చిత్తశుద్ధి, కర్తవ్య దీక్ష, దృఢ సంకల్పం, సేవానిరతికి ఆయన ఆదర్శంగా నిలిచారని చెప్పారు. నిస్వార్థంగా విద్యుక్త్ధర్మాన్ని నిర్వర్తించిన అతి కొద్దిమందిలో కేఎల్ రావు ఒకరన్నారు. 1950-60 దశకంలో దేశంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ పథకాలపై ఆయన తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. విశిష్ట సేవలతో దేశవాసుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన తెలుగుబిడ్డగా అభివర్ణించారు. నాలుగేళ్లుగా కేంద్రం నుంచి ఆశించినంతగా సాయం అందకపోయినా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.