ఆంధ్రప్రదేశ్‌

‘జోన్’పై రాజకీయ నిర్ణయం తీసుకున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 15: విశాఖ రైల్వే జోన్‌పై రాజకీయ నిర్ణయం అయిపోయిందని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఈనెల 13నే మోదీ దీనిపై నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రైల్వే జోన్ తానే తీసుకువస్తానని ఎంపీ హరిబాబు పదేపదే చెబుతున్నారు. ఏదియేమైనా ఆగస్ట్ నెలాఖరులోగా జోన్ వస్తుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దశలో విశాఖలో మళ్లీ దీక్షలు మొదలవుతున్నాయి. ఈ నెల 17న సాయంత్రం ఏడు గంటల నుంచి 18వ తేదీ ఉదయం ఏడు గంటల వరకూ విశాఖ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న రోడ్లపై పడుకుని నిరసన తెలపాలని మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్ణయించారు. నాన్ పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో ఈ నిరసన జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈ నెల 20వ తేదీన అఖిలపక్షం ఆధ్వర్యంలో విశాఖ నుంచి అరుకుకు రైలు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం విశాఖలో అఖిలపక్ష సమావేశం జరిగింది. 20వ తేదీన అరుకులో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు, బహిరంగ సభ నిర్వహించనున్నారు.