ఆంధ్రప్రదేశ్‌

ఫెడరేషన్‌లో విలీనమైన ఏపీ అర్బన్ బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 15: ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల అసోసియేషన్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల ఫెడరేషన్‌లో విలీనమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం బ్యాంకు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల ఫెడరేషన్ తృతీయ వార్షిక సమావేశంలో ఈమేరకు తీర్మానం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో విడివిడిగా ఫెడరేషన్లు పనిచేస్తున్నందున అసోసియేషన్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్, క్రెడిట్ సొసైటీల ఫెడరేషన్‌లో విలీనంచేస్తూ ఫెడరేషన్ కార్యదర్శి ఎం వెంకటరత్నం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అసోసియేషన్ పేరుతో వున్న నగదు నిల్వలు, డిపాజిట్లను ఫెడరేషన్ పేరుతో ప్రత్యేక ఖాతాను ఏర్పాటుచేసి నిర్వహించాలని, అసోసియేషన్ రికార్డులను భద్రపర్చాలని తీర్మానించారు. ఫెడరేషన్ అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం అసోసియేషన్ తీర్మానానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఫెడరేషన్లు ఏర్పాటుచేశామని, అవి కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయని ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు మానం ఆంజనేయులు తెలిపారు. జాతీయ సమాఖ్యలో సభ్యత్వం పొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరపున అసోసియేషన్ చురుగ్గా కార్యకలాపాలను నిర్వర్తించిందన్నారు. సమావేశంలో పాల్గొన్న ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ చల్లా శంకరరావు మాట్లాడుతూ 1986లో ఆర్యాపురం బ్యాంకు ఛైర్మన్ గన్ని సత్యనారాయణ అధ్యక్షునిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల అసోసియేషన్ ఆవిర్భవించిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి రెండు ఫెడరేషన్లు ఏర్పడినందున ఆ అసోసియేషన్‌ను ఫెడరేషన్‌లో విలీనంచేసే నిర్ణయం కూడా ఆర్యాపురం బ్యాంకు కార్యాలయం వేదికగానే జరగడం విశేషమన్నారు.