ఆంధ్రప్రదేశ్‌

బాబు, జగన్ వల్లే రాష్ట్ర విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూలై 22 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వల్లే రాష్ట్ర విభజన జరిగిందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. కర్నూలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కోట్ల సూర్య పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, జగన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై పోటీ పడి సోనియాగాంధీకి లేఖలు ఇచ్చారన్నారు. ఆ లేఖల్లో రాష్ట్ర విభజన పట్ల తమకు అభ్యంతరం లేదని, ఆమెపై ఒత్తిడి తేవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చిందన్నారు. ఇక చంద్రబాబు రుణమాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి రైతులను మోసం చేశాడని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 18వ తేదీ కర్నూలు నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఆ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.