ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు నుండి సూర్యలత కుమారి తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) ఆగస్టు 9: చీర అపహరణ వివాదానికి సంబంధించి దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు నుండి కె సూర్యలతకుమారిని తొలగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆదివారం దుర్గగుడిలో ఆషాఢ మాస సారెను అమ్మవారి సమర్పించిన సందర్భంలో భక్త మండలి సమర్పించిన 18వేల రూపాయల చీరను ఆమె తీసుకువెళ్ళినట్లు దుర్గగుడి ఈవో నివేదిక సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కె సూర్యలతకుమారిని తాత్కాలికంగా ధర్మకర్త విధులు నుండి తప్పిస్తూ బోర్డు కమిటీ చైర్మన్ వి గౌరంగబాబు నిర్ణయం తీసుకుని, ఆమోదించవల్సిందిగా కమిషనర్‌కు లేఖ రాశారు. దుర్గగుడిలో చీర మాయమైన వ్యవహారంలో ధర్మకర్త కె సూర్యలతకుమారి నిర్వాకంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలగటంతో సీఎం ఆదేశాల మేరకు ఆమెపై వేటు వేస్తూ జీవో విడుదల చేశారు.