ఆంధ్రప్రదేశ్‌

ఎన్డీఏ పార్టీలను బెదిరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలో ఎన్డీఏ పార్టీలను బెదిరించి బీజేపీ గెలిచిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బీజేపీ ఆధిక్యతతో గెలువలేదని, విధి లేని పరిస్థితుల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఇతర పార్టీలు ఓటు వేశాయని, మనఃస్ఫూర్తిగా వేయలేదని ఎద్దేవా చేశారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నిక 2019 ఎన్నిక బీజేపీ పునాదులు కదులుతాయనే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా, జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాల ఐక్యతకు మద్దతుగా టీడీపీ ఓటు వేసిందని తెలిపారు. బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకతను గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లే చెబుతున్నాయన్నారు. బీజేపీని గెలిపించేందుకే వైకాపా ఎంపీలు గైర్హాజరయ్యారని, దీని ద్వారా మేజిక్ మార్క్ తగ్గించి బీజేపీకి మేలు చేశారని గురువారం ఒక ప్రకటనలో యనమల ఆరోపించారు. ఏపీ ప్రజలను మోసగించేందుకు వైకాపా ఆడుతున్న మరో డ్రామా ఇది అని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ, వైకాపా పొత్తు వంద శాతం పక్కా అని వ్యాఖ్యానించారు. మోదీ, జగన్, విజయసాయిరెడ్డిల కన్నా ప్రజలే తెలివైనవారని తెలిపారు.