ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో దూసుకెళ్లిన బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: రాష్ట్ర విభజన తదుపరి రెండవ విడతగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో గురువారం హోరాహోరీగా జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ (బస్సు) విజయదుందుబి మోగించింది. మొత్తం 53,533 ఓట్లకుగాను 774 పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ 12వ తేదీన జరగనుంది. గురువారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 49,217 ఓట్లు పోలింగ్ కాగా క్లాస్ త్రీలో 124, క్లాస్ 6లో 142 ఓట్లు చెల్లలేదు. ఎంప్లారుూస్ యూనియన్‌కు 25,771 ఓట్లు రాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు 23,372 ఓట్లు వచ్చాయి. మొత్తంపై ఎంప్లాయిస్ యూనియన్ 2,399 ఓట్ల ఆధిక్యతతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సారి ఇతర కార్మిక సంఘాలన్నీ ఇయుతో కలిసి కూటమిగా పోటీ చేయటం కలిసివచ్చినట్లయింది. అయితే అత్యధిక జిల్లాల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ విజయం సాధించింది. కృష్ణా జోన్‌లో ఒక్క కృష్ణాలో ఇయు, నాన్ ఆపరేషన్ జోన్‌తోపాటు గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్‌ఎంయు విజయం సాధించింది. కడప జోన్‌లో నాన్ ఆపరేషన్ జోన్‌లో ఎంప్లారుూస్ యూనియన్ గెలుపొందినప్పటికీ కడప జిల్లాలో ఎన్‌ఎంయు తిరుగు లేని ఆధిక్యత సంపాదించుకుంది. అలాగే కర్నూలు జిల్లాలోను ఆధిక్యతను సంపాదించింది. అనంతపురంలో ఇయు గెలుపొందింది. నెల్లూరు జోన్‌లో నెల్లూరు ఆపరేషన్ జోన్, ప్రకాశం జిల్లాలోను ఎన్‌ఎంయు, నెల్లూరు జిల్లాలో ఫెడరేషన్, చిత్తూరులో ఇయు గెలుపొందాయి. విజయనగరం జోన్‌లో విజయనగరం నాన్ ఆపరేషన్ జోన్‌లో ఎన్‌ఎంయు, విశాఖ జిల్లాలో ఎన్‌ఎంయు, తూ,గోలోను, శ్రీకాకుళం - విజయనగరం జోన్‌లలోను ఇయు విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇయు సంబరాలు నెలకొన్నాయి.