ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ గిరిజన సంఘాలు, నేతలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బహిష్కరించి, గురువారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట సామూహిక శిరోముండనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 25 మంది గిరిజనులు శిరోముండనం చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘాల జాయింట్ వర్కింగ్ కమిటీ చైర్మన్ కుడుముల రామచంద్రయ్య, సలహాదారు కుందనాటి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్రప్రభుత్వం గిరిజనులకు అన్ని సంక్షేమ పథకాల్లోనూ, వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించిందన్నారు. గిరిజన మంత్రిత్వశాఖను గిరిజనేతరులకు ఇవ్వడం సరికాదన్నారు. ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ట్రైకార్‌కు చైర్మన్‌ను నియమిస్తామని చెప్పిన హామీలు నీటిమూటలయ్యాయన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపకుంటే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు అనుముల వంశీ, యునైటెడ్ ట్రైబల్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు కట్టా చిట్టిబాబు, చంద్రశేఖర్, యానాదుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంబేటి వెంకటసుబ్బయ్య, రాష్ట్ర సలహాదారు బాబురావు, విష్ణునాయక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..శిరోముండనం చేయించుకుంటున్న గిరిజన నేతలు