ఆంధ్రప్రదేశ్‌

రెండు కుటుంబాల చేతిలోనే అధికారం కేంద్రీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్ల, ఆగస్టు 9: బీసీల అభివృద్ధి పేరుతో కొన్ని కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి మినహా ఆయా కులాలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఐక్యతా లోపం కారణంగానే బీసీలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారన్నారు. అయితే ఇందుకు ఇతర కులాల నేతలను నిందించాల్సిన పనిలేదని, మోసపోవడానికి అవకాశమిస్తే ఎప్పటికీ ఇలా మోసం చేస్తూనే ఉంటారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం పెదఅమిరం గ్రామంలో గురువారం నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. బీసీల ఐక్యత ఇలాంటి సమావేశాల వరకే పరిమితమవుతోందని, గ్రామాలకు వెళ్లాక తిరిగి కులాల వారీగా విడిపోతున్నారన్నారు. ఐక్యత లేనందునే తమకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరిన నారుూబ్రాహ్మణులను ముఖ్యమంత్రి వేలు చూపించి, బెదిరించే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో అధికారం రెండు కులాల చేతిలోనే ఉంటుందనడం నిజం కాదని, నిజానికి చంద్రబాబు, జగన్ అనే రెండు కుటుంబాల చేతిలో కేంద్రీకృతమవుతోందన్నారు. కాపుల రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడితే బీసీలు దూరమవుతారని, వ్యతిరేకంగా మాట్లాడితే కాపులు దూరమవుతారని ఇలా ఓట్ల లెక్కలు వేసుకుని రాజకీయాలు సాగించడం దారుణమన్నారు. అందుకే కులాల ఐక్యత జరగాలని జనసేన కోరుకుంటోందన్నారు. అధికారమే పరమావధిగా తాను రాజకీయాల్లోకి రాలేదని, దారుణంగా పతనమవుతున్న వ్యవస్థను చక్కదిద్దడానికి, మార్పు కోసమే వచ్చానన్నారు. తన తుదిశ్వాస వరకు ప్రజలకు అండగా నిలబడతానన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న బ్రాహ్మణ సమాజం
భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతోంది బ్రాహ్మణ సమాజమేనని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. గురువారం జరిగిన బ్రాహ్మణ సంఘం నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని కులమతాలకు అతీతంగా నడిపింది బ్రాహ్మణులేనని గుర్తుచేశారు. అప్పట్లో నాయకులు అందరినీ సమానంగా చూసేవారని, అయితే నేటి నాయకులలో అది కొరవడిందన్నారు. సామాజిక న్యాయంకోసం రాజకీయాల్లోకి వచ్చానని, కులాన్ని నమ్ముకుని రాలేదన్నారు. అన్ని కులాల బాగుకోసం పార్టీ స్థాపించానన్నారు. త్వరలోనే తమ మేనిఫెస్టోలో అన్ని వివరాలు తెలుపుతానన్నారు. భీమవరం పట్టణానికి చెందిన సంఘసేవకుడు చెరుకువాడ రంగసాయితో పాటు పలువురు బ్రాహ్మణ సంఘ నేతలు పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

చిత్రం..పవన్ కళ్యాణ్‌ను సత్కరిస్తున్న బీసీ సంఘ నేతలు