ఆంధ్రప్రదేశ్‌

గురుకులంలో వికృత చేష్టలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి రూరల్, ఆగస్టు 9: గురుకులంలో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. కింది తరగతుల విద్యార్థులపై కొంతమంది పదో తరగతి విద్యార్థులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. చీకటి పడగానే వారు ఉంటున్న గదుల్లోకి వెళ్లి లైట్లు ఆర్పివేసి అసహజ పద్దతిలో లైంగికదాడికి పాల్పడేవారు. సహకరించని వారిని బెల్టుతో చితకబాదేవారు. అనారోగ్యం బారిన పడిన పిల్లలు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగింది చెప్పడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు గురువారం పాఠశాల వద్దకు చేరుకుని ఇంచార్జి ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు. పోలీసులకు సమాచారం అందించారు. అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండలం కాళసముద్రం గురుకుల పాఠశాలలో జరిగిన ఈ దారుణం గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత విద్యార్థులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కదిరి రూరల్ మండలం కాళసముద్రంలో గురుకుల పాఠశాలలో సుమారు 650 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారం రోజుల క్రితం ముగ్గురు పిల్లలకు జ్వరం రావడంతో ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు. పిల్లలను చికిత్స కోసం కదిరి ఆసుపత్రిలో చేర్పించగా వారిని పరీక్షించిన వైద్యులు లైంగికదాడి జరిగినట్లు ధృవీకరించారు. గురువారం పిల్లలతో కలిసి పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు జరిగిన దారుణంపై ఇంచార్జి ప్రిన్సిపాల్ శివప్రసాద్‌ను నిలదీశారు. బాగా చదువుకుంటారని బడికి పంపితే హింసిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కదిరి తహసీల్దార్ పీవీ రమణ, నల్లమాడ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, పట్నం ఎస్‌ఐ గోపి, ఎంఈఓ చెన్నక్రిష్ణ పాఠశాలకు వెళ్లి జరిగిన విషయం తెలుసుకున్నారు. తమపై జరుగుతున్న లైంగికదాడులను పిల్లలను అధికారుల ఎదుట ఏకరువుపెట్టారు. రాత్రివేళల్లో విద్యుత్ లైట్లు ఆఫ్ చేసి పదో తరగతి విద్యార్థులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని పేర్కొన్నారు. సహకరించకపోతే బెల్టుతో కొట్టేవారని కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకం అనుభవించామని విలపించారు. దీంతో అధికారులు పాఠశాల అధ్యాపకులను తీవ్రంగా మందలించారు. ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. విద్యార్థులపై లైంగికదాడి జరిగిన సంగతి తన దృష్టికి రాలేదని ఇంచార్జి ప్రిన్సిపాల్ శివప్రసాద్ తెలిపారు. తల్లిదండ్రులు గురువారం తన దృష్టికి తీసుకురావడంతో ముగ్గురు పదవ తరగతి విద్యార్థులకు టీసీ ఇచ్చి బయటకు పంపినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన అన్నారు.

చిత్రం..గురుకుల పాఠశాలలో విచారణ జరుపుతున్న అధికారులు