ఆంధ్రప్రదేశ్‌

చురుగ్గా 42 ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) పార్కులను, క్లస్టర్లను ఎక్కువగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రతి నియోజక వర్గ పరిధిలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను, కొన్ని చోట్ల క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 13 జిల్లాల్లో ఈ పార్క్‌ల ఏర్పాటు వల్ల అన్ని జిల్లాల్లో సమానంగా పారిశ్రామిక అభివృద్ధి చెందే వీలు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది. 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా, ఇప్పటికే 42 చోట్ల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. గుంటూరు, కడప జిల్లాల్లో భూసేకరణ మరో రెండు నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులతో పాటు సెక్టార్ ఆధారిత 11 ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లను ఆరు జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయనుంది.
ఇప్పటికే ఈ క్లస్టర్లకు సంబంధించి 10 చోట్ల భూమి అందుబాటులో ఉంది. విశాఖ జిల్లా పెందుర్తి, భీమిలిలో వైద్య పరికరాలు, శస్తచ్రికిత్స పరికరాల తయారీకి వీలుగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ, మైలవరం వద్ద ప్లాస్టిక్, కెమికల్ ఉత్పత్తుల క్లస్టర్లను, కావలి, నెల్లూరు వద్ద గార్మెంట్, వుడ్ ప్రోసెసింగ్, ఫర్నిచర్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో డెయిరీ ఉత్పత్తుల, హిందూపురం, పుట్టపర్తిల్లో సిల్క్, ఆటోమొబైల్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. సగటున 100 ఎకరాల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి దెందులూరులో వ్యవసాయ పరికరాల క్లస్టర్‌ను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కాకుండా, ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి 2244 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు 3642 కోట్ల రూపాయలు పెట్టుబడలు వచ్చేలా అవగాహనా ఒప్పందాలు చేసుకుంది. వీటిలో 1096 యూనిట్లు వివిధ దశల్లో ఉన్నాయి.