ఆంధ్రప్రదేశ్‌

యూటర్న్ తీసుకోవడంలో జగన్ సిద్ధహస్తుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: యూటర్న్‌లు తీసుకోవడంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధహస్తుడని, యూటర్న్ బోర్డులున్న చోట జగన్ ఫొటోలు పెట్టాలంటూ శాసన మండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. గురువారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంలో జగన్ ఎవరి ఒత్తిడికి తలొగ్గారో ప్రజలకు చెప్పాలన్నారు. బీజేపీ అహంకారాన్ని దించాల్సిందిపోయి వారికే అమ్ముడుపోయి ఓటింగ్‌కు దూరం కావడం దారుణమన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. అయితే ఆంధ్రుల ఆత్మగౌరవం దృష్ట్యా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసామన్నారు. నిన్న బీజేపీకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పి నేడు ఎందుకు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఇక బీజేపీ ఎంపీ జీవీఎల్...ఓ పవర్ బ్రోకర్. అధికార పార్టీని అడ్డుపెట్టుకుని పనులు చేయించే వ్యక్తి అన్నారు. ఇప్పటికే అనేక కుంభకోణాలు చేశాడన్నారు. జీవీఎల్ చరిత్ర యావత్ తన చేతిలో ఉందన్నారు. జీవీఎల్ అవినీతి మొత్తం బయటపెడతామని, వందల కోట్లు ఎలా సంపాదించారో సాక్ష్యాధారాలతో వెల్లడిస్తానని బుద్దా వెంకన్న అన్నారు. జీవీఎల్ అవినీతి బట్టబయలు చేయలేకుంటే రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలంటూ జీవీఎల్‌కు సవాల్ విసిరారు. జీవీఎల్ వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం బాబుకు, లోకేష్‌కు లేనేలేదన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగు ప్రజలే తమ సత్తా ఏమిటో చూపిస్తారని, బీజేపీకి గట్టి బుద్ధి చెబుతారని వెంకన్న అన్నారు.