ఆంధ్రప్రదేశ్‌

హోదా సాధనలో చంద్రబాబు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 9: ఐదు కాదు, పది కాదు ఏకంగా పదిహేనేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు విభజన హామీలను సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగట్టారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రావి వెంకట రమణ అధ్యక్షతన జరిగిన గర్జన దీక్షలో పార్టీ ప్రధాన నేతలంతా పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 4 గంటలకు ముగిసింది. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాసనమండలి పక్ష నేత డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రధానంగా ప్రత్యేక హోదా విషయంలో ఎన్నో డ్రామాలు ఆదారని, హోదా కంటే ప్యాకేజీ బెటర్ అని చెప్పిన చంద్రబాబు ఆనక మాట మార్చి ప్రజలను గందరగోళానికి గురి చేశారన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయని, హోదా కోసం వైసీపీ పార్లమెంటు సభ్యులంతా రాజీనామాలు చేస్తే, రాష్ట్రం యావత్తు తమను ఎంతో ఆదరించిందని గుర్తుచేశారు. కేంద్రప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ పెద్దలు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వాలు పాలించే నైతిక హక్కును కోల్పోయాయని, రాష్ట్రాన్ని మోసం చేసిన ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైసీపీ మాత్రమేనని గుర్తుచేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ అబద్దాలు చెప్పటంలో చంద్రబాబును మించిన వారు మరొకరు లేరని, ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం దౌర్భాగ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు అవినాష్‌రెడ్డి, వరప్రసాద్, రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
చిత్రం..వంచనపై గర్జన దీక్షకు ముందు వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న వైసీపీ నేతలు